|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ సమ్మర్ షాక్: ముగ్గురు స్టార్ హీరోల నుండి అదిరిపోయే అప్డేట్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 21-03-2026, 6:05 AM
టాలీవుడ్ సమ్మర్ షాక్: ముగ్గురు స్టార్ హీరోల నుండి అదిరిపోయే అప్డేట్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ టీజర్ మార్చి 27న రిలీజ్!
  • అల్లు అర్జున్, అట్లీ AA22 X A6 గ్లింప్స్ ఏప్రిల్ 8న అదుర్స్!
  • NTRNeel మూవీ టీజర్ మే 20న విడుదల చేసేందుకు సన్నాహాలు!
  • ముగ్గురు స్టార్ హీరోల అప్డేట్స్ తో సమ్మర్ అదిరిపోనుంది!

టాలీవుడ్ లో సమ్మర్ సందడి మొదలైంది! ముగ్గురు స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ అభిమానులకు వరుస అప్‌డేట్స్‌తో ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమ్మర్ లో బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం!

రామ్ చరణ్ ‘పెద్ది’ టీజర్ అప్‌డేట్

స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాల నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వారి అభిమానులు ఎంతగానో ఆనందపడుతుంటారు. అలాంటి ఆనందాన్ని ఈ సమ్మర్‌లో ముగ్గురు స్టార్ హీరోలు తమ అభిమానులకు పంచబోతున్నారు. మన టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ సినిమాలకు సంబంధించిన అదిరిపోయే రేంజ్ అప్డేట్లు ఈ వేసవిలో రానున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది ’ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో ఒకటి, రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ AA22 X A6 గ్లింప్స్ రిలీజ్!

అల్లు అర్జున్ – అట్లీ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న AA22 X A6 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

NTRNeel మూవీ టీజర్ విడుదల ఎప్పుడంటే?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న NTRNeel చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మే 20న విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాల అప్‌డేట్స్‌తో సమ్మర్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.