
📌 Key Points
- టాలీవుడ్ దృష్టి అమరావతిపై: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీకి ముహూర్తం ఖరారు!
- ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు: భారీగా పెట్టుబడులు పెట్టనున్న టాలీవుడ్ ప్రముఖులు.
- స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు: ఏపీలో సినిమా షూటింగ్‌లతో ఉపాధి లభించనుంది.
- చంద్రబాబు, పవన్ సంయుక్త కార్యాచరణ: టాలీవుడ్‌కు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధం!
టాలీవుడ్ ఇక అమరావతికి షిఫ్ట్ కానుందా? ఏపీ రాజధానిలో ఫిల్మ్ సిటీ నిర్మించనున్నారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇది.
అమరావతిలో ఫిల్మ్ సిటీ: టాలీవుడ్ భారీ ప్లాన్!
Tollywood : అమరావతికి టాలీవుడ్ విస్తరణ హాట్ టాపిక్‌గా కొనసాగుతూనే ఉంది. 2014లో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడంతో సినీ పెద్దలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడే నవ్యాంధ్రకు టాలీవుడ్ విస్తరణ జరుగుతోందన్న అంచనాలు ఉండేవి. కానీ రాజధాని అంశం సస్పెన్స్‌గానే కంటిన్యూ అయింది.
ఇప్పుడు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రావడం ఆల్ మోస్ట్ పూర్తి కావడంతో టాలీవుడ్ ప్రముఖుల ఆలోచన మారుతోందట. టాలీవుడ్ హీరోలు, టాప్ డైరెక్టర్లు, బిగ్ ప్రొడ్యూసర్లు త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే ఈ మీటింగ్ కోసం డేట్స్ ఫైనలైజ్ చేస్తున్నట్టు లీకులు బయటికి వస్తున్నాయి.
చంద్రబాబు, పవన్ భేటీ: టాలీవుడ్‌కు శుభవార్త?
చంద్రబాబు, పవన్‌తో జరిగితే భేటీలో అమరావతిలో ఫిల్మ్ సిటీ, స్టూడియోలు, ప్రొడక్షన్ హౌసెస్ ఏర్పాటు వంటి అంశాలను చర్చించబోతున్నారట. ఏపీకి కూడా టాలీవుడ్ విస్తరిస్తే అక్కడ సినిమా షూటింగ్‌లు జరిగితే స్థానిక యువతకు ఉపాధి కల్పించొచ్చని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టబోతున్నారని టాక్.
ఏపీలో షూటింగ్‌లు: స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు!
పవన్ కల్యాణ్ హీరోగా ఉన్నందున, ఇండస్ట్రీ కష్టాలేంటో తెలిసిన వ్యక్తి కావడంతో త్వరలో జరగబోయే సమావేశం చాలా స్పెషల్ అని అంటున్నారు. పలువురు నిర్మాతలు, టాప్ హీరోలు ఇన్వెస్ట్ చేసి ఫిల్మ్ సిటీ, స్టూడియోలు ఏర్పాటుతో అమరావతిని సినిమా హబ్‌గా మార్చాలనే ప్లాన్ కూడా ఉందన్న గాసిప్ హల్ చల్ చేస్తోంది.
అమరావతికి టాలీవుడ్ తరలింపు వార్తలు ఊపందుకున్నాయి. త్వరలో జరగబోయే మీటింగ్ తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


