|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌లో పెళ్లి బాజా: ముగ్గురు హీరోల వైవాహిక జీవితంలోకి అడుగులు! రష్మిక కూడా!

Published: 23-02-2026, 8:35 AM
టాలీవుడ్‌లో పెళ్లి బాజా: ముగ్గురు హీరోల వైవాహిక జీవితంలోకి అడుగులు! రష్మిక కూడా!
  • విజయ్ దేవరకొండ, రష్మిక ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోనున్నారు.
  • అల్లు శిరీష్ మార్చి 6న నైనిక రెడ్డిని వివాహం ఆడనున్నారు.
  • పునర్నవి భూపాలం మార్చి 20న హేమంత్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
  • ఈ మూడు జంటల పెళ్లిళ్లతో టాలీవుడ్ సందడిగా మారింది.

టాలీవుడ్ సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అల్లు శిరీష్, పునర్నవి భూపాలం త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి విశేషాలు

Toll wood Industry Weddings: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజలు మోగబోతున్నాయి గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న జంటలు ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పెళ్లి హడావిడి మొదలైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించిన మూడు జంటలు వరుసగా పెళ్లి బంధంతో ఒకటి కావడానికి సిద్ధమవుతున్నారు. మరి పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్న ఆ కొత్త జంటలు ఎవరు? ఏంటీ? అనే విషయానికి వస్తే..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహ వేడుక అని చెప్పాలి. గత కొంతకాలంగా వీరు పెళ్లి గురించి ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. రూమర్లను నిజం చేస్తూ ఈ జంట ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

అల్లు శిరీష్ వివాహం గురించి వివరాలు

టాలీవుడ్ మరో యంగ్ హీరో అల్లు శిరీష సైతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా శిరీష్ గౌరవం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు . ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన శిరీష్ వ్యక్తిగత జీవితంలో కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నారు గత రెండు సంవత్సరాలుగా నైనిక రెడ్డితో ప్రేమలో ఉన్న ఈయన మార్చి 6వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ జంట గత ఏడాది అక్టోబర్ 31వ తేదీ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

పునర్నవి భూపాలం నటిగా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు సినిమాల కంటే కూడా బిగ్ బాస్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇటీవల తన ప్రియుడు హేమంత్ వర్మతో కలిసి నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి వివాహం మార్చి 20వ తేదీ జరగబోతోంది .ఇక హేమంత్ వర్మ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తెలుస్తుంది .

పునర్నవి భూపాలం పెళ్లి వార్తలు

ఈ మూడు జంటలు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి మొదలైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ రష్మిక జంట కుటుంబ సభ్యులతో కలిసి ఉదయపూర్ చేరుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహపు వేడుకలు 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి.

మొత్తానికి టాలీవుడ్ లో ఈ ముగ్గురు జంటలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండటంతో ఇండస్ట్రీలో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు కూడా తమ అభిమాన నటుల పెళ్లి వేడుకల కోసం ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.