|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫుల్ స్వాగ్‌లో వచ్చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి.. ‘దేత్తడి’ మూవీ నుంచి మాస్ లుక్ రిలీజ్

Published: 01-05-2025, 3:14 AM
ఫుల్ స్వాగ్‌లో వచ్చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి.. ‘దేత్తడి’ మూవీ నుంచి మాస్ లుక్ రిలీజ్

టాలీవుడ్ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్ నగర జీవితం నేపథ్యంగా ఉంటుందని తెలిపారు.

Key Points

1

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి 'దేత్తడి' సినిమాతో మాస్ లుక్‌లో కనిపించనున్నాడు.

2

ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా 'దేత్తడి' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

4

హైదరాబాద్ నగర జీవితం నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

‘దేత్తడి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్‌రాజు(Dil Raju) అన్న కొడుకు ఆశిష్ (Ashish Reddy)అందరికీ సుపరిచితమే. ‘రౌడీ బాయ్స్’ (Rowdy boys)సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీ హిట్‌గా నిలవడంతో ఆయన రేంజ్ పెరిగిపోయింది. తన నటన, చలాకీ తనంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక గత ఏడాది ‘లవ్ మి’ సినిమాతో వచ్చాడు. కానీ హిట్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ‘సెల్ఫిష్’ (Selfish)చిత్రంలో నటిస్తున్నాడు. ఇవానా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కసి విశాల్(Kasi Vishal) తెరకెక్కిస్తున్నారు.

ఆశిష్ రెడ్డి మాస్ లుక్

అయితే ఈ సినిమా మే 30న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈక్రమంలో.. తాజాగా, ఆశిష్ మరో మూవీ ప్రకటించాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. అయితే ‘దేత్తడి’ (Dethadi)పేరుతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య రావు గంగసాని(Aditya Rao Gangasani) తెరకెక్కిస్తున్నారు. దీనిని అనిత ప్రజెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, రూతమ్ స్టోరీ ల్యాబ్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరిష్, రుతమ్ సమర్ నిర్మిస్తున్నారు. అయితే ఇది దిల్ రాజు బ్యానర్‌పై రాబోతున్న 60వ సినిమా కావడం విశేషం.

హైదరాబాద్ నగర జీవితం నేపథ్యం

హైదరాబాద్‌లోని వీధులు ఎలా ఉంటాయో అక్కడి ప్రజలు ఎలాంటి జీవనాన్ని కొనసాగిస్తారో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక విడుదలైన ఫస్ట్ లుక్‌లో ఆశిష్ ఏవో వేడుకలు జరుగుతుండగా.. అక్కడ నోట్లో ఏదో పెట్టుకుని బ్యాండ్ వాయిస్తూ మాస్ లుక్‌లో కనిపించాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘హైదరాబాద్ వీధులు గురించి చెప్పడానికి ఒక కథను తీసుకురాబోతున్నాం. పూర్తి స్వాగ్ వచ్చేస్తున్నాడు.. పక్కా హైదరాబాదీ సినిమా’’ అని క్యాప్షన్ జత చేశారు. ఇక పోస్టర్‌లో ‘‘గాడ్ ఫ‌టీతో ఫ‌టీ మ‌గ‌ర్ న‌వాబి నా ఘ‌టీ` అని ఉంది. అయితే ఈ సారి ఆశిష్ ప‌క్కా రూటెడ్ స్టోరీతో రా కంటెంట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్రస్తుతం ఆశిష్ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ మూవీపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోందని చెప్పొచ్చు. ఆశిష్ మాస్ సినిమాతో రాబోతుండటంతో ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు.

మొత్తం మీద, ఆశిష్ రెడ్డి ‘దేత్తడి’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మాస్ లుక్ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.