|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్

Published: 10-07-2025, 5:09 AM
అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ కథనం ఆయన అనారోగ్యం, దాని ప్రభావం మరియు అనుసరిస్తున్న చికిత్స గురించి వివరిస్తుంది.

Key Points

1

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తీవ్రమైన సైనస్ సమస్యతో బాధపడుతున్నారు.

2

ఈ సమస్య వల్ల ఆయన నిద్రకు కూడా ఇబ్బంది పడుతున్నారు.

4

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెడిటేషన్, స్తోత్రాలు వింటున్నారు.

సందీప్ కిషన్ ఆరోగ్య సమస్యలు

టాలీవుడ్ లో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉన్న యంగ్ హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొంత మంది ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలబడాలని పోరాడుతున్నారు. గెలుపు ఓటములు చూడకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి హీరోలలో ఒకరైన యంగ్ స్టార్ ఇటు తెలుగులో, అటు తమిళంలో కూడా తన లక్కును పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఈక్రమంలోనే ఆ హీరో తనకు ఉన్న ఓ అనారోగ్య సమస్యను గురించి వెల్లడించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరా యంగ్ స్టార్

టాలీవుడ్‌లో యంగ్ స్టార్లుగా నిలిచిన నటులలో సుందీప్ కిషన్ ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో హీరోగా నిలబడేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. కాని సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈక్రమంలోనే సందీప్ కిషన్ తనకు ఉన్న అనారోగ్య సమస్య గురించి ఓ సందర్భంలో వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచాడు.

సైనస్ సమస్య తీవ్రత

ఈ మధ్య సందీప్ కిషన్ నటించిన సినిమాల్లో మజాకా కూడా ఒకటి. ఈ సినిమా కూడా సందీప్ కు నిరాశే మిగిల్చింది. ఈక్రంమలో ఈసినిమా రిలీజ్ కు ముందు జరిగిన ప్రమోషన్స్ సందర్భంగా ఆయన ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా తన అనారోగ్యం గురించిన విషయం షేర్ చేశారు.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తీవ్రంగా సైనస్ సమస్య ఉందని సందీప్ కిషన్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోగ్య ఇబ్బంది కారణంగా ప్రతిరోజూ నిద్రపోవడానికి కూడా గ్యాప్‌గా తీసుకోవలసి వస్తుంది. అప్పుడప్పుడు కారావాన్ లోనే నిద్రపోతాను, పని నుంచి కాస్త టైమ్ దొరికితే చాలు రెస్ట్ తీసుకుంటాను. అప్పుడప్పుడు ముక్కు నుంచి లోపలి భాగం వరకూ బ్లాక్ అవుతుంది. ముక్కుండి వెనకభాగం వరకు క్లోజ్ అయిన ఫీల్ వస్తుంది” దాని వల్ల నరకం చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు.

చికిత్స ఎంపికలు

ఈ సమస్య కారణంగా ఉదయాన్నే లేవగానే ఎవరితో కూడా మాట్లాడను, నా ఫ్యామిలీ మెంబర్స తో కూడా మాట్లాడను.. లేవగానే ముందు వేడిగా టీ తాగాలి, మెడిటేషన్ మ్యూజిక్ వింటా, స్తోత్రాలు వింటా, ఆ త‌ర్వాతే ఇంట్లో వారితో మాట్లాడుతా అని సందీప్ కిషన్ వెల్లడించారు. ఇది పాటించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ప్రశాంతంగా ఉందన్నారు. ఒత్తిడులను ఎదుర్కొంటానికి ఇది ఒక మార్గం అని ఆయన పేర్కొన్నారు.

అయితే, సైనస్ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి.. ఇది తగ్గించుకోవడం కోసం సర్జరీకి వెళ్లాలి. కాని అది చేసినపుడు ముక్కు మారిపోతుందని, ముఖ కూడా మారిపోతుందని అందుకే సర్జరీకి వెళ్లడంలేదు అన్నారు సందీప్ కిషన్. కాని ఎప్పటికైనా సర్జరీ తప్పదంటున్నారు. లేదంటే నీరు పెరిగినప్పుడు ఊపిరితిత్తులను తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటప్పుడు భయంగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు షూటింగ్ కు వెళ్ళడం కూడా ఇబ్బందిగానే మారుతుంది అన్నారు సందీప్. ఈక్రమంలో ఆరోగ్యంకంటే ఏది ముఖ్యం కాదు అని నెటిజన్లు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

సందీప్ కిషన్ తన ఆరోగ్య సమస్యను ధైర్యంగా వెల్లడించడం అభినందనీయం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆయన నిర్ణయం మిగతా వారికి స్ఫూర్తినిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.