
📌 Key Points
- రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం 9 రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరింది.
- రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ 5 రోజుల్లో 400 కోట్ల మార్కును అందుకుంది, నాగార్జున విలన్‌గా మెప్పించారు.
- చిన్న బడ్జెట్ సినిమా ‘సైయారా’ 12 రోజుల్లో 400 కోట్ల వసూళ్లను అధిగమించి పెద్ద విజయం సాధించింది.
- రిషబ్ శెట్టి ‘కాంతార 1’ 6 రోజుల్లో 400 కోట్లు సాధించినా, 1000 కోట్ల లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
భారతీయ సినీ చరిత్రలో 400 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 బ్లాక్‌బస్టర్ చిత్రాలను పరిశీలిద్దాం. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్న ధురంధర్, రజనీకాంత్ సినిమా, సైయారా, ఛత్రపతి శంభాజీ మహారాజ్, కాంతార 1 వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ధురంధర్: 400 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ సత్తా
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 436 కోట్లకు పైగా
డిసెంబర్ 5, 2025న విడుదలైన ‘ధురంధర్’ 9 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ నటించారు.
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 518 కోట్లు
ఆగస్టు 14, 2025న విడుదలైన రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. 5 రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా లో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున విలన్ పాత్రలో నటించి మెప్పించారు. శ్రుతి హాసన్ కూడా ఈ సినిమాలో సందడి చేసింది.
రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్: ఐదు రోజుల్లోనే రికార్డు వసూళ్లు
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 570.33 కోట్లు
జూలై 18, 2025న విడుదలైన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా ‘సైయారా’. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 12 రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది మూవీ. ఈసినిమా బడ్జెట్ 30 కోట్లుకూడా దాటలేదు.
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 807.91 కోట్లు
కాంతార 1: ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో సంచలనం
ఫిబ్రవరి 14, 2025న విడుదలైన హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించారు. ఈమూవీ లో శంభాజీ రాజ్ గా విక్కీ నటన మెస్మరైజ్ చేసింది. రష్మిక యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారు.
ప్రపంచవ్యాప్త కలెక్షన్: 852.23 కోట్లు
కాంతార 1 సినిమా 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్‌లో చేరింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ 100 కోట్ల మార్క్ ను టచ్ అవ్వాలనుకున్న రిషబ్ ఆశ మాత్రం నెరవేలరలేదు. 800 కోట్ల దగ్గరే ఈసినిమా కలెక్షన్స్ ఆగిపోయాయి.
ఈ టాప్ 5 సినిమాలు 400 కోట్ల క్లబ్‌లో చేరి, భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాయి. విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని, భారీ వసూళ్లతో సినీ చరిత్రలో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.


