|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే

Updated: 01-10-2025, 11:01 PM
Top 5 OTT Movies and Series: ఓటీటీలో కూలీకి షాకిచ్చిన మహావతార్‌ నరసింహ, సైయారా.. రజనీ మూవీ స్థానం ఎక్కడంటే

ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓర్మాక్స్ మీడియా ఈ వారం టాప్ 5 ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల జాబితాని విడుదల చేసింది. మహావతార్ నరసింహ అగ్రస్థానంలో నిలవగా, సైయారా, హృదయపూర్వం కూడా మంచి వ్యూస్ సాధించాయి. రజనీకాంత్ కూలీ సినిమా ఆశించిన స్థాయిలో వ్యూస్ పొందలేకపోయింది.

Key Points

1

ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన సెప్టెంబర్ 22-28 ఓటీటీ వ్యూస్ లిస్ట్ ఇది.

2

మహావతార్ నరసింహ (57 లక్షల వ్యూస్), సైయారా (45 లక్షల వ్యూస్) టాప్‌లో నిలిచాయి.

4

టాప్ వెబ్ సిరీస్‌లలో వెన్స్‌డే సీజన్ 2, డూ యు వానా పార్టనర్ స్థానం సంపాదించాయి.

ఈ వారం టాప్ 5 ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

ఈ మధ్య ఓటీటీలకు ఆదరణ పెరుగుతుంది. థియేటర్ కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తుండటంతో దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో థియేటర్‌కి వచ్చి చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇంట్లో నుంచే ఏ భాషా చిత్రాన్నైనా చూసే సౌలభ్యం ఓటీటీ కల్పిస్తోంది. దీంతో థియేటర్లో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా  సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ఓటీటీలో ఎక్కువ వ్యూస్ పొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాని విడుదల చేసింది ఓర్మాక్స్ మీడియా. ఇది ప్రతి వారం ఈ డేటాని అందిస్తుంది.

ఓటీటీలో అత్యధిక వ్యూస్ పొందిన చిత్రాల జాబితాలో బాలీవుడ్‌ మూవీ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఐదో స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 19 లక్షల వ్యూస్ వచ్చాయి. రజినీకాంత్ ‘కూలీ’ నాలుగో స్థానానికి పడిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి గత వారం 30 లక్షల వ్యూస్ వచ్చాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఊపేంద్ర, సత్యరాజ్‌, శృతి హాసన్‌, సౌబిన్‌ షాహిర్‌ ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదలై థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఐదు వందల కోట్ల వసూళ్లని రాబట్టింది. అయినప్పటికీ హిట్‌ జాబితాలో చేరలేకపోయింది.

మహావతార్ నరసింహ, సైయారా ఆధిపత్యం

ఈ జాబితాలో మోహన్‌లాల్ ‘హృదయపూర్వం’ మూడో స్థానంలో ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 34 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ థియేటర్లలోనూ సత్తా చాటింది. ఇప్పుడు దాన్ని మించి ఓటీటీలో మంచి వ్యూస్‌ సాధిస్తోంది. ఇక థియేటర్లో దుమారం రేపిన బాలీవుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ‘సైయారా’ రెండో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి 45 లక్షల వ్యూస్ వచ్చాయి. దీంతపాటు యానిమేషన్‌ మైథలాజికల్‌ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహ’ 57 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. థియేటర్లలోనూ ఈ మూవీ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం థియేటర్లలో ఏకంగా రూ.325కోట్లు రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్‌ కేవలం రూ.15కోట్లు మాత్రమే కావడం విశేషం.

రజనీకాంత్ కూలీ స్థానం: ఆశించిన వ్యూస్ రాలేదా?

అత్యధిక వ్యూస్ పొందిన వెబ్ సిరీస్‌ల జాబితాలో ‘వెన్స్‌డే’ సీజన్ 2 (.8 మిలియన్‌ వ్యూస్‌) ఐదో స్థానంలో ఉంది. తమన్నా నటించిన ‘డూ యు వానా పార్టనర్’ ( 1.3M)నాలుగో స్థానంలో ఉంది. ‘సిక్సర్స్’ సీజన్ 2(1.8M) మూడో స్థానంలో, ‘ది ట్రయల్’ సీజన్ 2(2.8M) రెండో స్థానంలో ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ 57 లక్షల వ్యూస్‌తో మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్‌ సెలబ్రిటీల తెరవెనుక జీవితాలు, లవ్‌ స్టోరీస్‌, లస్ట్ వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించారు. ఇందులో బాలీవుడ్‌ మొత్తం గెస్ట్ లు మెరిశారు. అంతేకాదు తెలుగు నుంచి రాజమౌళి కూడా కాసేపు అలరించారు. దీంతో భారీ హైప్‌ నెలకొంది. దీనికితోడు తమన్నా స్పెషల్‌ సాంగ్‌ దుమ్ములేపింది. ఓటీటీలో ఈ సిరీస్‌ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. దీనికి 5.7 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వారం టాప్ 5 జాబితా థియేటర్లో పెద్దగా ఆడని చిత్రాలకు సైతం భారీ వ్యూస్ వస్తున్నాయని రుజువు చేసింది. రజనీకాంత్ వంటి స్టార్ల సినిమాల ర్యాంకులు కూడా మారుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.