
ఈ వారాంతంలో థియేటర్లలో కొత్త సినిమాలకు ఆదరణ తక్కువగా ఉంది. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం 33 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్కసారిగా విడుదలయ్యాయి. వీటిలో కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
Key Points
33 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్కరోజే ఓటీటీల్లోకి!
గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్ లాంటి సినిమాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
'దేవిక & డానీ' తెలుగు సిరీస్ ఆసక్తికరంగా కనిపిస్తోంది.
వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.
ఓటీటీలో విడుదలైన సినిమాల జాబితా
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈ వారం థియేటర్లలోకి వచ్చిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ తేలిపోయింది. పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు శుక్రవారం.. బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.
ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వడక్కన్, ఓ యుముడి ప్రేమకథ లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా వచ్చాయి. వీటితో పాటు ‘దేవిక & డానీ’ అనే తెలుగు సిరీస్ కూడా కాస్త ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏ మూవీ వచ్చిందంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (జూన్ 06)
సుశీల సుజిత్ – మరాఠీ మూవీ
బెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ – హిందీ సినిమా
మట్ లాక్ సీజన్ 1 – ఇంగ్లీష్ సిరీస్
జొరకయ్యా తట్టుంగ – తమిళ సినిమా
గ్రౌండ్ జీరో – హిందీ మూవీ
ఆకర్షణీయంగా ఉన్న కొన్ని సినిమాలు
భోల్ చుక్ మాఫ్ – హిందీ సినిమా
అంటిల్ డాన్ – ఇంగ్లీష్ మూవీ
పారిస్ ఇన్ బాలీ – ఇండోనేసియన్ మూవీ
ద అకౌంటెంట్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా
దేవిక & డానీ – తెలుగు సిరీస్
ఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 – ఇంగ్లీష్ సిరీస్
ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ – ఇంగ్లీష్ సినిమా
మెర్సీ ఫర్ నన్ – కొరియన్ సిరీస్
ద సర్వైవర్స్ – ఇంగ్లీష్ సిరీస్
తెలుగు సిరీస్ ‘దేవిక & డానీ’
గోల్డెన్ సిక్స్‌టీన్స్ సీజన్ 1 – జపనీస్ రియాలిటీ షో
లాల్ సలామ్ – తెలుగు డబ్బింగ్ సినిమా
వడక్కన్ – తెలుగు డబ్బింగ్ మూవీ
ఒక యుమడి ప్రేమకథ – తెలుగు డబ్బింగ్ సినిమా
చౌర్య పాఠం – తెలుగు సినిమా
హై ఫోర‍్సెస్ – చైనీస్ సినిమా
ద లాస్ట్ విష్ – తెలుగు డబ్బింగ్ మూవీ
చివరగా, ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమా ప్రేమికులకు వినోదాన్ని అందించాయి. వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లతో, ప్రేక్షకులకు ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.


