
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. ఈ వారం కూడా అనేక ఆసక్తికరమైన చిత్రాలు విడుదలవుతున్నాయి. మనం వాటిలో అత్యుత్తమమైన ఐదు చిత్రాలను ఈ జాబితాలో చూద్దాం.
Key Points
ఈ వారం అమెజాన్ ప్రైమ్‌లో 'కుబేర' బ్లాక్ బస్టర్ విడుదల!
జియో హాట్‌స్టార్‌లో 'స్పెషల్ ఆప్స్ 2.0' యాక్షన్ థ్రిల్లర్!
జీ5లో 'భైరవం' మూవీ మరియు 'భూత్నీ' హారర్ కామెడీ!
నెట్‌ఫ్లిక్స్‌లో వీర్ దాస్ 'ఫూల్ ప్రూఫ్' స్టాండప్ కామెడీ!
ఈ వారం ఓటీటీలో వచ్చే బెస్ట్ సినిమాలు
ఓటీటీలోకి ప్రతివారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయో ముందుగానే ఆయా ప్లాట్‌ఫామ్స్ అనౌన్స్ చేస్తుంటాయి. ఈవారం కూడా అలా ఎన్నో మూవీస్, సిరీస్ రానున్నాయి. అయితే వాటిలో చూడాల్సిన టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్, షోల జాబితాను మేము ఇక్కడ ఇస్తున్నాం. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.
ఈవారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ కుబేర . జూన్ 20న థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం (జులై 18) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మరోసారి తన మార్క్ మూవీ అందించాడు. ఈ సినిమాను ఓటీటీలో మిస్ కావద్దు.
2. స్పెషల్ ఆప్స్ 2 – జియోహాట్‌స్టార్
తెలుగు బ్లాక్ బస్టర్ ‘కుబేర’ ఓటీటీలో
ఇక ఈవారం ఓటీటీ లోకి వస్తున్న మరో సూపర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ 2.0. నిజానికి గత వారమే రావాల్సి ఉన్నా వారం వాయిదా పడింది. జియోహాట్‌స్టార్ లో ఈ శుక్రవారం (జులై 18) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తొలి సీజన్, ఆ తర్వాత 1.5 అంటూ వచ్చిన ఓ షార్ట్ సీజన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ రెండో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కే కే మేనన్.. హిమ్మత్ సింగ్ గా మరోసారి రాబోతున్నాడు.
ముగ్గురు హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం . మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జులై 18) జీ5 ఓటీటీలోకి అడుపెట్టనుంది. మే 30న రిలీజై ఈ మూవీ సుమారు 50 రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ఈ వారం ఓటీటీలోకి వస్తున్న హారర్ కామెడీ మూవీ భూత్నీ (Bhootnii). ప్రముఖ బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్ , మౌనీ రాయ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా శుక్రవారం (జులై 18) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మే 1న థియేటర్లలో మూవీ రిలీజైంది. రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.
యాక్షన్, హారర్ కామెడీ, స్టాండప్ కామెడీ షోలు
5. వీర్ దాస్ ఫూల్ వాల్యూమ్ – నెట్‌ఫ్లిక్స్
ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతున్న స్టాండప్ కామెడీ షో వీర్ దాస్ – ఫూల్ ప్రూఫ్. ప్రముఖ కమెడియన్, నటుడు వీర్ దాస్ హోస్ట్ చేస్తున్న ఈ షోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ శుక్రవారం (జులై 18) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వినోదం కోసం చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చిన జోనర్‌ను ఎంచుకుని ఆనందించండి!


