
ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన తాజా ఓటీటీ వీక్షణల జాబితా ప్రకారం, గత వారం అత్యధికంగా వీక్షించిన టాప్ 5 వెబ్ సిరీస్‌లు ఏంటో తెలుసుకుందాం. అమెజాన్ MX ప్లేయర్ మరియు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో చూద్దాం.
Key Points
అమెజాన్ MX ప్లేయర్ లో 'రైజ్ అండ్ ఫాల్' 3.8 మిలియన్ వ్యూస్ తో టాప్ లో!
టీవీఎఫ్ 'హాఫ్ సీఏ సీజన్ 2' 2.7 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో!
'వెన్స్‌డే సీజన్ 2' 2.4 మిలియన్ వ్యూస్ తో మూడో స్థానం సాధించింది!
'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' మరియు 'సారే జహాన్ సే అచ్చా' టాప్ 5లో ఉన్నాయి!
అత్యధిక వీక్షణలు సాధించిన టాప్ 5 షోలు
ఓటీటీల్లో ప్రతివారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసే విషయం తెలుసు కదా. తాజాగా గత వారానికి సంబంధించిన జాబితాను సోమవారం (సెప్టెంబర్ 8) రిలీజ్ చేసింది. వీటిలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అయ్యే సిరీస్ లు ఉన్నాయి.
రైజ్ అండ్ ఫాల్ – అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్
రైజ్ అండ్ ఫాల్ ఓ రియాలిటీ షో. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. అష్నీర్ గ్రోవర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో 16 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. ఈ మధ్యే ఈ షో మొదలైంది. ఇందులో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ కూడా పాల్గొంటోంది. ఈ షోకి గత వారం 3.8 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. టాప్ లో ఉంది.
హాఫ్ సీఏ సీజన్ 2 – అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్
ఫ్రీ స్ట్రీమింగ్‌తో ఆకట్టుకున్న రెండు షోలు
ఇక అదే అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి ఈ మధ్యే వచ్చిన మరో టీవీఎఫ్ వెబ్ సిరీస్ హాఫ్ సీఏ సీజన్ 2. రెండేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రెండో సీజన్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఇది రాగానే ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తున్నారు. గతవారం తొలి స్థానంలో ఉండగా.. ఈసారి 2.7 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది.
వెన్స్‌డే సీజన్ 2 – నెట్‌ఫ్లిక్స్
హారర్ కామెడీ వెబ్ సిరీస్ వెన్స్‌డే సీజన్ 2 పార్ట్ 2 గత వారమే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ సిరీస్ మూడో స్థానంలో నిలిచింది. దీనికి గతవారం 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తొలి సీజన్ కంటే రెండో సీజన్ కు మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ పార్ట్ ఆగస్టులో రాగా.. సెకండ్ పార్ట్ ఈ మధ్యే వచ్చింది.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో – నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ MX ప్లేయర్‌లో హిట్ షోలు
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నాలుగో స్థానంలో ఉంది. ఈ షోని గత వారం 2 మిలియన్ల మంది చూశారు. కపిల్ శర్మ హోస్ట్ చేసే షో ఇది. చాలా వరకు ప్రతి వారం ఈ షో టాప్ 5లోనే కొనసాగుతూ వస్తోంది.
సారే జహాన్ సే అచ్చా – నెట్‌ఫ్లిక్స్
నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అయ్యే మరో వెబ్ సిరీస్ సారే జహాన్ సే అచ్చా. ఈ సిరీస్ ఐదో స్థానంలో ఉంది. ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు గత వారం 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాకిస్థాన్ లో పని చేసిన ఓ ఇండియన్ రా ఏజెంట్ చుట్టూ తిరిగే స్పై థ్రిల్లర్ ఇది.
మొత్తం మీద, ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వినోద ప్రేమికులను ఆకట్టుకున్న టాప్ 5 వెబ్ సిరీస్‌లు ఇవి. ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్న రెండు షోలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించాయి.


