|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్‌ ఫస్టాఫ్‌ రిపోర్ట్‌.. అభినయంతో ఆకట్టుకున్న స్టార్స్‌ వీళ్లే!

Published: 09-07-2025, 5:01 AM
బాలీవుడ్‌ ఫస్టాఫ్‌ రిపోర్ట్‌.. అభినయంతో ఆకట్టుకున్న స్టార్స్‌ వీళ్లే!

సాధారణంగా సినిమా విజయాలను కలెక్షన్లతో అంచనా వేస్తారు. కానీ, ఈసారి బాలీవుడ్‌ మీడియా అభినయ ప్రతిభను ప్రధానంగా తీసుకొని, ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అద్భుత నటన ప్రదర్శించిన 8 మంది నటీనటులను ఎంపిక చేసింది.

Key Points

1

అభిషేక్ బెనర్జీ 'స్టోలెన్' సినిమాతో అద్భుత నటన ప్రదర్శించారు.

2

సన్యా మల్హోత్రా 'మిస్ట్రెస్' లో ఆకట్టుకునే పాత్ర పోషించారు.

4

వామికా గబ్బీ 'బూల్ చుక్ మాఫ్' లో ప్రేమ, సమస్యలను చక్కగా వ్యక్తపరిచారు.

అభినయంతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటీనటులు

సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు. అలాగే ప్రతీ ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ, ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్‌ డమ్‌ను విశ్లేషించడం కూడా రివాజు. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది. బాలీవుడ్‌ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్‌ను గుర్తిస్తోంది. అందులో భాగంగా 8మంది తారల్ని ప్రకటించింది. అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే…

అభిషేక్‌ బెనర్జీ స్టోలెన్‌  సినిమాలో నటించిన అభిషేక్‌ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు. ఈ చిత్రంలో ప్రతీ భావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన.  అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది. తరచూ నిశ్శబ్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్ధంగా నిలిచిపోయింది.

సన్యా మల్హోత్రా మిస్ట్రెస్‌ సినిమాలో నటించిన  సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది.  ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం, ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం – ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు. కానీ ఆమె ఆ పాత్రకు జీవం పోసింది.

స్టోలెన్, మిస్ట్రెస్, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాల ప్రభావం

ఆదర్శ్‌ గౌరవ్‌ సూపర్‌ బాయ్స్‌ ఆఫ్‌ మాలెగావ్‌ సినిమాలో ఆదర్శ్‌ గౌరవ్‌ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు. అందుకే అంత సులభంగా అతను ఫేమస్‌ అయ్యాడు. చిన్న పట్టణపు యువత కలలను ప్రతిబింబించడంతో పాటు  హాస్య–భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండి పోయాడు.

వామికా గబ్బీ బూల్‌ చుక్‌ మాఫ్‌ చిత్రంలో నటించిన వామికా గబ్బీ ప్రేమచుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కున్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది. తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ..ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా  నిలిచింది.

రణదీప్‌ హుడా మంచి విజయాన్ని సాధించిన జాట్‌ సినిమాలో  రణదీప్‌ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని  ప్రదర్శించాడు.   అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో..రణదీప్‌ నటన జాట్‌ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది.

ఈ ఏడాది అర్ధభాగంలో అత్యుత్తమ నటన

కాజోల్‌ ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్‌ నటి  కాజోల్‌… మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. మాతృత్వ బాధ్యతల్లో మునిగి పోయిన ఒక సగటు తల్లిగా కాజోల్, పటిష్టంగా పలికించిన  భావోద్వేగాల లోతు అంతరంగాల్ని  తాకుతుంది.

విక్కీ కౌశల్‌ చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్‌ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం. మరాఠా వీరుడు శంభూజీ మహరాజ్‌ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్టించిన తీరు అమోఘం. దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కధను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో విక్కీ…విజయం సాధించాడు.

అమీర్‌ఖాన్‌… భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానెందుకు మిగిలిన హీరోల కన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్‌ఖాన్‌ మరోసారి విజయం సాధించాడు. సితారే జమీన్‌ పర్‌ లో అమీర్‌ ఖాన్‌ తన స్టార్‌ డమ్‌ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా… మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పనిలో ఆయన విజయం సాధించాడు.

బాలీవుడ్‌లో ఈ ఏడాది మొదటి అర్ధభాగం అద్భుతమైన నటనకు సాక్ష్యం. ఈ నటీనటుల ప్రతిభ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వారి భవిష్యత్తు సినిమాల కోసం ఎదురుచూస్తున్నాము.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.