
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సహా అనేక ఆసక్తికరమైన ఎంపికలు ఉన్నాయి.
Key Points
విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' ఓటీటీలో!
మెట్రో ఇన్ దినో, ది 100 లాంటి సినిమాలు ఓటీటీలో!
ప్రైమ్ వీడియోలో లవ్ మ్యారేజ్, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్!
హాఫ్ సీఏ సీజన్ 2, 4.5 గ్యాంగ్ వెబ్ సిరీస్‌లు అందుబాటులో!
నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సినిమాలు
ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడ ఇస్తున్న జాబితాలోని సినిమాలు, వెబ్ సిరీస్ మిస్ కాకుండా చూడండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ వారం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అడుగుపెట్టాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే.
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయి ఉంటే ఈ మూవీని ఓటీటీలో చూడండి. ఈ వీక్ ఓటీటీలోకి వచ్చిన పెద్ద తెలుగు సినిమా ఇదే.
మెట్రో ఇన్ దినో – నెట్‌ఫ్లిక్స్
ఇక నెట్‌ఫ్లిక్స్ లోకే వచ్చిన మరో మూవీ మెట్రో ఇన్ దినో. ఈ హిందీ సినిమా థియేటర్లలో సక్సెస్ సాధించిన తర్వాత శుక్రవారం (ఆగస్టు 29) డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇది కూడా వీకెండ్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100 ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. జులై 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఉంది. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది.
లవ్ మ్యారేజ్ – ప్రైమ్ వీడియో
ప్రైమ్ వీడియోలో అద్భుత చిత్రాలు
లవ్ మ్యారేజ్ ఓ తమిళ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా తెలుగులో వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రీమేక్. తాజాగా ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది.
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ – ప్రైమ్ వీడియో
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ నేరుగా ప్రైమ్ వీడియో లోకి వచ్చిన హిందీ మూవీ. కశ్మీరీ ఆర్టిస్టులు పడే కష్టాలు, వాటిని సవాలుగా తీసుకొని సాధించిన విజయాలు చుట్టూ తిరిగే మూవీ ఇది.
హాఫ్ సీఏ సీజన్ 2 – అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్
ఇక హాఫ్ సీఏ సీజన్ 2 వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి వచ్చేసింది. తొలి సీజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో రెండో సీజన్ గురించి చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని ఎంపికలు
ది క్రానికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్ – సోనీ లివ్
మలయాళం క్రైమ్ వెబ్ సిరీస్ ది క్రానికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్. ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మురా. ఈ సినిమా గతేడాది డిసెంబర్ లోనే ప్రైమ్ వీడియోలోకి వచ్చినా.. తాజాగా రెండో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది. సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ ఇది. సన్ నెక్ట్స్ లో చూడొచ్చు.
ఇక భావన నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ది డోర్. ఈ సినిమా ఆహా తమిళ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తమిళ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ మూవీ చూడొచ్చు.
కన్నడ థ్రిల్లర్ వెబ్ సిరీస్ శోధ జీ5 ఓటీటీలోకి వచ్చింది. తన భార్యనే గుర్తు పట్టలేని ఓ వ్యక్తి చుట్టూ తిరిగే సిరీస్ ఇది. జీ5లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ఈ వీకెండ్‌కు మీకు కావలసిన అన్ని ఓటీటీ ఎంటర్‌టైన్మెంట్ ఇక్కడ ఉంది. వినోదం కోసం సిద్ధంగా ఉండండి!


