
📌 Key Points
- యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ టీజర్ విడుదల, ఇది సందీప్ రెడ్డి సినిమాలను గుర్తు చేస్తుంది.
- టీజర్లో బోల్డ్ సన్నివేశాలు, పవర్ఫుల్ యాక్షన్ ఉండటంతో ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.
- సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమాను ‘టాక్సిక్’ టీజర్ గుర్తు చేస్తుందని అభిమానుల అభిప్రాయం.
- ‘టాక్సిక్’ సినిమాలో యష్ హీరోగా నటిస్తుండగా, కియారా అద్వానీ, నయనతార వంటి తారాగణం నటిస్తున్నారు.
యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూస్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వ శైలి గుర్తుకు వస్తోందని నెటిజన్లు అంటున్నారు. బోల్డ్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లతో టీజర్ ఆకట్టుకుంటుంది.
‘టాక్సిక్’ టీజర్ విడుదల: సందీప్ రెడ్డి గుర్తుకు వస్తున్నారా?
Geetu Mohandas – Sandeep Vanga: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సందీప్ రెడ్డి ఒకరు. ఈయన చేసింది కేవలం రెండు సినిమాలే అయినప్పటికీ ఈ రెండు సినిమాల ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి (Sandeep Reddy)ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరొక పాన్ ఇండియా స్టార్ హీరో యష్ (Yash)నటిస్తున్న టాక్సిక్ (Toxic)సినిమా నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ వీడియో విడుదల చేశారు.
ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టించింది. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఈ టీజర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. అలాగే ఈ టీజర్ వీడియోలో బోల్డ్ సన్నివేశాలను కూడా చూపించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు నెటిజన్లు విభిన్న రీతిలో ఈ టీజర్ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టీజర్ వీడియో చూస్తుంటే సందీప్ రెడ్డి గుర్తుకొస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.
టీజర్ పై నెటిజన్ల కామెంట్స్, రియాక్షన్స్
సాధారణంగా ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తూ ఇలాంటి బోల్డ్ యాక్షన్ ,సన్ని వేషాలను సందీప్ రెడ్డి ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. అచ్చం ఇదేవిధంగా గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) సైతం టాక్సిక్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని ఈ సినిమా టీజర్ చూస్తుంటే సందీప్ రెడ్డి డైరెక్షన్ వచ్చిన యానిమల్ సినిమా గుర్తుకు వస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మరికొందరు మాత్రం ఈ టీజర్ చూస్తుంటే ఒక లేడీ డైరెక్టరా ఈ సినిమా చేసింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ టీజర్ వీడియో పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. ఇక టాక్సిక్ సినిమా డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇందులో యశ్ హీరోగా నటించగా కియారా అద్వాని, తారాసుతారియా, రుక్మిణి వసంత్, నయనతార వంటి తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తూ సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
డ్రగ్ మాఫియా నేపథ్యంలో ‘టాక్సిక్’ చిత్రం
మొత్తానికి ‘టాక్సిక్’ టీజర్ విడుదల సందీప్ రెడ్డి వంగ సినిమాలను గుర్తు చేస్తూ, సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.


