|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: గాయని జానకి ఇంట విషాదం! కుమారుడి హఠాన్మరణం.. కారణం ఇదేనా?

Published: 22-01-2026, 3:05 AM
షాకింగ్: గాయని జానకి ఇంట విషాదం! కుమారుడి హఠాన్మరణం.. కారణం ఇదేనా?
  • సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం: ప్రముఖ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీ కృష్ణ ఆకస్మిక మరణం
  • 65 ఏళ్ల వయసులో మురళీ కృష్ణ మృతి.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం, దిగ్భ్రాంతి చెందిన సినీ ప్రముఖులు
  • భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన మురళీకృష్ణ.. పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
  • జానకి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న సినీ ప్రముఖులు, మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థనలు

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీ కృష్ణ హఠాన్మరణం చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎస్. జానకి కుమారుడి మరణం

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ ఎంత మంది సినీ ప్రముఖులను పరిశ్రమ కోల్పోయింది. రిసెంట్ గా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 65 సంవత్సరాల వయసులో మురళీ కృష్ణ మరణం.. వారి కుటుంబంతో పాటు.. ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆవేదన కలిగించింది.

సంతాపం తెలుపుతున్న సినీ ప్రముఖులు

మురళీ కృష్ణ మరణ వార్తను మరో స్టార్ సింగర్ చిత్ర వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. ”ఈ బాధకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని.. తాను ఎంతో ప్రియమైన సోదరుడిని కోల్పోయాను, ఈ ఉదయం మురళీ అన్న ఆకస్మిక మరణవార్త విని నేను షాకయ్యాను. మేము ఒక ప్రేమగల సోదరుడిని కోల్పోయాము. ఈ భరించలేని బాధను దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక.. మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి. ఓం శాంతి” అంటూ రాసుకొచ్చారు సింగర్ చిత్ర.

మురళీకృష్ణ మల్టీ టాలెంటెడ్ వ్యక్తి

సింగర్ జానకి తనయుడు మురళీకృష్ణ మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. ఆయన నటుడు, నాట్యకళాకారుడు. భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన మురళీ.. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంతే కాదు ఆయన పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మురళీకృష్ణ మృతితో ఎస్. జానకి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు జానకికి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆమెకు మనోదైర్యాన్నిప్రసాదించాలని కోరుకుంటున్నారు.

మురళీ కృష్ణ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.