|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గుండె నిండా గుడి గంటలు: విల్లాలో దెయ్యాల బీభత్సం! సొంతిల్లు అమ్మేద్దామన్న మనోజ్, బాలుతో మాస్ వార్!

Published: 04-05-2026, 1:45 AM
గుండె నిండా గుడి గంటలు: విల్లాలో దెయ్యాల బీభత్సం! సొంతిల్లు అమ్మేద్దామన్న మనోజ్, బాలుతో మాస్ వార్!
  • 5 కోట్ల విల్లా కోసం 70 లక్షలు కావాలి, సొంత ఇల్లు అమ్మేద్దామన్న మనోజ్ నిర్ణయం షాకింగ్!
  • విల్లాలో దెయ్యాలున్నాయో లేదో చూడటానికి మంత్రగత్తె ఎంట్రీ, అసలు నిజం బయటపెట్టిన బాలు ప్రణాళిక!
  • దెయ్యాల భయంతో వణికిపోయిన ప్రభావతి, ఇంట్లో దెయ్యాలున్నాయని నమ్మి భీతిల్లిన కుటుంబం!
  • బాలు దెయ్యాల డ్రామాతో ఇల్లు వదిలేయాలని చూస్తున్న మనోజ్, బాలు మధ్య మాస్ ఫైట్!

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఈరోజు జరిగిన ఎపిసోడ్ ప్రేక్షకులను షాక్ కి గురిచేసింది! విల్లాలోకి మంత్రగత్తె ప్రవేశం, మనోజ్ తీసుకున్న సంచలన నిర్ణయం, బాలుతో మాస్ ఫైట్.. ఇలాంటి ఊహించని ట్విస్టులతో సీరియల్ రసవత్తరంగా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ!

మంత్రగత్తె ఎంట్రీతో విల్లాలో హైడ్రామా!

Gunde Ninda Gudi Gantalu Serial May 4th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 4వ ఎపిసోడ్‌లో న్యూమరాలజిస్ట్ తర్వాత మంత్రగత్తె వచ్చి దెయ్యాలు ఉన్నాయో లేవే చూస్తుంది. 5 కోట్ల విల్లాకు 2 కోట్ల బ్యాంక్ లోన్ మాత్రమే వస్తుంది. మరో 70 లక్షల కోసం సొంతిల్లు అమ్మేద్దామని మనోజ్ అంటాడు. ప్రభావతి ఒప్పుకోదు.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో న్యూమరాలజిస్ట్‌కు 20 వేలు ఇచ్చి పంపిస్తాడు మనోజ్. విల్లా పేరు రోమతి అంటూ తెగ సంబరపడిపోతుంది ప్రభావతి . రీసౌండ్స్ ఉన్నాయో లేదో చూసేందుకు ఆవిడ వస్తుందని, ఆవిడ ఘోస్ట్ హంటర్ (దెయ్యాలు పట్టుకునే వారు) అని, అంతా బయటకెళ్దామని మనోజ్ ఫ్రెండ్ మణికంఠ చెబుతాడు.

ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే సీసాలో బంధించి తీసుకెళ్తుందని మనోజ్ అంటాడు. దెయ్యాల వేటకు వచ్చిందా అని బాలు అంటాడు. కబికతం అంటూ ఆవిడ మంత్రాలు చదువుతుంది. ఇది క భాష అండి. నాకు వచ్చు అని తను కూడా బాలుతో చెబుతుంది మీనా. ఓ దొంగ మంత్రగత్తా.. ఇప్పుడేం చేస్తాం. వాడు ఇంకో 20 వేలు వదిలించుకుంటుంటే చూద్దామని బాలు అంటాడు. అయ్యో పాపమండి అని మీనా అంటుంది.

దాంతో ఈవిడ దొంగ మంత్రగత్తే అని మా అనుమానంరా అని మనోజ్‌కు చెబుతాడు బాలు. ఇంట్లో దెయ్యాలు ఉంటే మమ్మల్ని పీడించుకుని విల్లా ఖాళీ చేయాలని చూస్తున్నావా అని మనోజ్ అంటాడు. వాడు వినట్లేదు. ఫ్రీగా వచ్చే దెయ్యం సినిమా చూసినట్లు చూద్దామని బాలు అంటే మీనా సరేనంటుంది. తర్వాత ఇంట్లో కాంచన పాట వినిపిస్తుంది. కాసేపటికి అది బాలు పెడతాడు. సత్యం అనడంతో బాలు ఆపుతాడు.

అందరిని లాంతర్‌ను చూడమంటుంది మంత్రగత్తె. బాలు సైలెంట్‌గా వెళ్లి లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తుంటాడు. ఇదేంటీ ఇలా అవుతుందని మంత్రగత్తెనే భయపడుతుంది. ఈ ఇంట్లో ఇన్ని దెయ్యాలు ఉన్నాయా, ఇది విల్లా కాదురా దెయ్యాల దిబ్బలా ఉందని ప్రభావతి భయపడుతుంది. అంతా భయపడుతారు. తర్వాత లైట్స్ ఆన్ చేసి వస్తాడు బాలు. దెయ్యాలు ఉన్నాయి కాబట్టే వాడు రెడు కోట్లు తక్కువకు ఇచ్చాడని బాలు అంటాడు.

సొంతిల్లు అమ్మకానికి మనోజ్ సంచలన నిర్ణయం!

అమ్మో అని భయపడుతాడు మనోజ్. నేనే మెయిన్ ఆఫ్ చేశాను. ఏ దెయ్యాలు లేవు అని బాలు అంటే.. నేను అదే చెప్పాలనుకున్నా అని మంత్రగత్తె అంటుంది. ఇందాక ఉందన్నారని అంటే.. నా మంత్రాలకు పోయిందని ఆవిడ అంటుంది. క భాష కూస్తే దెయ్యాలు పోతాయా అని మీనా అంటుంది. అదంతా అబద్ధం అత్తయ్య అని మీనా అంటే.. నీకెం తెలుసే అని అరుస్తుంది ప్రభావతి.

నువ్వు కూడా తొందర్లోనే రెస్టారెంట్ పెడతావ్ అని శ్రుతి అంటుంది. ఇల్లు డాక్యుమెంట్స్ చూసి రూ. 2 కోట్ల వరకు లోన్ ఇవ్వగలమని బ్యాంక్ వాళ్లు అంటారు. ఇల్లు వాల్యూ 5 కోట్లు అయితే 2 కోట్లు ఇస్తారంటారేంటీ, 3 కోట్ల లోన్ కావాలని సత్యం అంటాడు. కానీ, 3 కోట్లు ఇచ్చేందుకు మా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవని వారు అంటారు. మీరు ఓకే అనుకుంటే ఈ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండని బ్యాంక్ వాళ్లు వెళ్లిపోతారు.

కామాక్షిని పిలిచి మనోజ్‌ను చూసి బ్యాంక్ వాళ్లు 2 కోట్లు ఇస్తానన్నారని గొప్పగా చెబుతుంది ప్రభావతి. తీసుకునేటప్పుడు కాదు కట్టేటప్పుడు తెలుస్తుంది అసలు సంగతని శ్రుతి అంటుంది. ఎడమ చేత్తో ఎంత తేలిగ్గా కట్టేస్తాడో చూడు అని ప్రభావతి అంటే.. సత్యం చూస్తాడు. దాంతో భయపడి కామాక్షిని తీసుకుని ప్రభావతి వెళ్లిపోతుంది. మనకు ఇంకా రూ. 2.7 కోట్లు కావాలి. బ్యాంక్ వాళ్లు 2 కోట్లే ఇస్తామంటున్నారు. ఇంకా 70 లక్షలు ఎలా అని రోహిణి అంటుంది.

ఈ విల్లా కూలిపోను. ఉన్న ఇంటికే ఎసరు పెట్టాడు కదరా దేవుడో దేవుడా అని కూర్చుని ఏడ్చినట్లు చేస్తాడు. ఇల్లు అమ్మడానికి మేము ఒప్పుకోమని బాలు, రవి అంటారు. నా వాటా కింద వచ్చేదే ఇవ్వమంటున్నాను, మీ వాటాతో మీరు కూడా సెటిల్ అవ్వొచ్చు అని మనోజ్ అంటాడు. ఈ విల్లా తీసుకునేది రెంట్‌కు ఇద్దామని కదా. ఉన్న ఇంటిని అమ్మేస్తే ఎక్కడ ఉంటారని శ్రుతి నిలదీస్తుంది. ఆ ఇల్లు జ్ఞాపకాల నిలయం అని రవి అంటాడు.

బాలు Vs మనోజ్: దెయ్యాల డ్రామాతో మాస్ ఫైట్!

మరి అత్తయ్య, మావయ్య ఎక్కడుంటారని మీనా అంటుంది. రోజుల లెక్కన ఉంచుదామంటాడేమో. ఇప్పుడు అనవే నా కొడుకు అని బాలు అంటాడు. అందరిని పంపించి ఇల్లు నువ్వు ఒక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావని నాకు తెలుసు. నీ స్వార్థ బుద్ధి ఏంటో నాకు తెలుసురా అని బాలును మనోజ్ అంటాడు. దాంతో మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు. బాలు, మనోజ్ ఇద్దరు విల్లాలో కొట్టుకుంటారు.

ఆ ఇల్లు మా నాన్న జ్ఞాపకం. దాన్ని అమ్మేసి ఆయన్ను మర్చిపోలేనురా అని ప్రభావతి షాక్ ఇస్తుంది. బాలు చాలా ఆశ్చర్యపోతాడు. ఇల్లు అమ్మకుంటే విల్లా కొనలేము కదా అని రోహిణి అంటుంది. కొనొచ్చమ్మా.. మీ నాన్న దగ్గర డబ్బు ఉందిగా. మీ నాన్నను అడుగు అని ప్రభావతి అంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకు చుట్టుకుందా అని రోహిణి కంగారుపడుతుంది.

అమ్మ చెప్పింది కరెక్టే కదా. ఒక్కసారి అడిగి చూడమని మనోజ్ కూడా అంటాడు. నాన్న జైళ్లో ఉన్నాడుగా. ఎలా ఇస్తాడని రోహిణి అంటే.. మీ మలేషియా మావయ్య బయటే ఉన్నారుగా, అడుగమ్మా అని ప్రభావతి అంటుంది. సరే అని చాలా ఇబ్బందిగా అంటుంది. మలేషియా మావయ్యకు కాల్ చేసినట్లుగా విద్యకు కాల్ చేసి 70 లక్షలు కావాలని అడుగుతుంది.

అమ్మ పూలగంప భలే కనిపెట్టావ్. అదేంటో మనం కనిపెడదామని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ సంచలన పరిణామాలు గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి. మరిన్ని ఉత్కంఠభరితమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.