
📌 Key Points
- దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ నుంచి 12 రైళ్లను రద్దు చేసింది.
- ఏప్రిల్ 10 నుంచి 18 వరకు మహబూబ్ నగర్ వెళ్లే రైళ్లు రద్దు.
- మన్యంకొండ స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనులే రైళ్ల రద్దుకు కారణం.
- ప్రయాణికులు ఈ మార్పులను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే సూచన.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక! కాచిగూడ నుండి నడిచే 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మహబూబ్ నగర్ – మన్యంకొండ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. రద్దయిన రైళ్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రైళ్ల రద్దుకు గల కారణాలు
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. మొత్తం 12 రైళ్లు పలు తేదీల్లో రద్దయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్లే ( నంబర్ 67781)ను ఏప్రిల్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు.
రద్దు చేయబడిన రైళ్ల వివరాలు
మహబూబ్ నగర్ – మన్యంకొండ స్టేషన్ల మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి… టికెట్లను బుకింగ్ చేసుకోవాలని కోరింది.
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచన
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రైళ్ల రద్దు నిర్ణయం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేదే అయినప్పటికీ, మరమ్మత్తు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.


