
ప్రభాస్ నటించే ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి డాక్టర్‌గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పోలీస్‌గా నటించడంతో వారి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Key Points
స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు.
త్రిప్తి దిమ్రి డాక్టర్ పాత్రలో నటించనున్నారు.
డాక్టర్ మరియు పోలీస్ మధ్య ఆకర్షణీయమైన రొమాన్స్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం.
ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారి, ప్రభాస్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.
ప్రభాస్ మరియు త్రిప్తి దిమ్రి కాంబినేషన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న వరుస బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ‘స్పిరిట్’(Spirit) ఒకటి. సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అంటూ సినీ ప్రియులతో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి(Tripthi Dimri) హీరోయిన్‌గా నటించనున్నట్లు రీసెంట్‌గా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో యానిమల్ సమయంలో ఏ రేంజ్‌లో ఫేమ్ తెచ్చుకుందో ఈ ముద్దుగుమ్మ మరోసారి ఈ అనౌన్స్మెంట్ తోనే మరింత పాపులర్ అయింది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే త్రిప్తి దిమ్రి మాత్రం డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. డాక్టర్ – పోలీస్ మధ్య రొమాన్స్ సీన్స్ కూడా బానే ఉన్నాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
త్రిప్తి దిమ్రి పాత్ర విశేషాలు
స్పిరిట్ సినిమాపై అంచనాలు
చివరగా, స్పిరిట్ సినిమాలో త్రిప్తి దిమ్రి పాత్ర అభిమానులను ఆశ్చర్యపరచడం ఖాయం. డాక్టర్-పోలీస్ ప్రేమకథ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


