|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Triptii Dimri : ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్.. మరి త్రిప్తి దిమ్రి పాత్ర ఏంటో తెలుసా? త్రిప్తి రెమ్యునరేషన్ ఎంతంటే?

Published: 28-05-2025, 11:06 AM
Triptii Dimri : ‘స్పిరిట్’లో ప్రభాస్ పోలీస్.. మరి త్రిప్తి దిమ్రి పాత్ర ఏంటో తెలుసా? త్రిప్తి రెమ్యునరేషన్ ఎంతంటే?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె పాత్ర, రెమ్యునరేషన్ గురించి తెలుసుకుందాం.

Key Points

1

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

2

త్రిప్తి దిమ్రి డాక్టర్ పాత్రలో నటిస్తూ ప్రభాస్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించనుంది.

4

దీపికా పదుకోనే ఈ సినిమాలో నటించడానికి 20 కోట్లు రెమ్యునరేషన్ అడిగింది.

ప్రభాస్ మరియు త్రిప్తి దిమ్రి పాత్రలు

Triptii Dimri : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ అని కూడా సందీప్ చెప్పేసాడు. ఈ డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవ్వనుంది అని సమాచారం. మొదటి షెడ్యూల్ మెక్సికోలో జరగనుంది. అయితే ఇటీవల స్పిరిట్ హీరోయిన్ విషయం బాగా ట్రెండ్ అయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

స్పిరిట్ సినిమాలో మొదట దీపికా పదుకోన్ ని హీరోయిన్ అనుకున్నా ఆమె బోలెడు కండిషన్స్ పెట్టడంతో వద్దనుకుని యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రిని హీరోయిన్ గా ప్రకటించారు. యానిమల్ సమయంలో ఏ రేంజ్ లో ఫేమ్ తెచ్చుకుందో త్రిప్తి దిమ్రి మరోసారి స్పిరిట్ సినిమాలో హీరోయిన్ అనౌన్స్మెంట్ తోనే మరింత పాపులర్ అయింది.

త్రిప్తి దిమ్రి రెమ్యునరేషన్ వివరాలు

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్ర అయితే త్రిప్తి దిమ్రి డాక్టర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. డాక్టర్ – పోలీస్ మధ్య రొమాన్స్ సీన్స్ కూడా బానే ఉన్నాయట. అలాగే ఈ సినిమాకు త్రిప్తి దిమ్రి 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. దీపికా పదుకోన్ ఈ సినిమాకు 20 కోట్ల రెమ్యునరేషన్ అడగడమే కాకుండా ప్రాఫిట్స్ లో కూడా షేర్ అడిగి పలు కండిషన్స్ పెట్టింది.

సినిమా షూటింగ్ మరియు విడుదల తేదీ

ఇప్పుడు త్రిప్తి దిమ్రి కేవలం 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడంతో మూవీ యూనిట్ కి భారీగా డబ్బులు సేవ్ అయ్యాయని అంటున్నారు. మరి ప్రభాస్ – త్రిప్తి దిమ్రి రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ప్రభాస్ మరియు త్రిప్తి దిమ్రి జంట నటన, స్పిరిట్ సినిమాలో వారి రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. త్రిప్తి రెమ్యునరేషన్ విషయంలోనూ ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.