|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రిష బర్త్‌డే సర్‌ప్రైజ్: విశ్వంభరలో ఈ బ్యూటీ క్యారెక్టర్ పేరు ఇదే

Published: 04-05-2025, 5:10 AM
త్రిష బర్త్‌డే సర్‌ప్రైజ్: విశ్వంభరలో ఈ బ్యూటీ క్యారెక్టర్ పేరు ఇదే

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రంలో త్రిష కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలువడింది.

Key Points

1

త్రిష పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.

2

త్రిష ఈ చిత్రంలో 'అవని' పాత్రలో నటిస్తున్నారు.

4

చిరంజీవి, త్రిష జోడీ 'స్టాలిన్' తర్వాత మళ్ళీ కలుస్తున్నారు.

త్రిష ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వాయిదా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చాలా ఏళ్లకు వీరి జోడీ రిపీట్ అవుతోంది. నేడు (మే 4) త్రిష పుట్టిన రోజు కావడంతో ఓ సర్‌ప్రైజ్ తీసుకొచ్చింది మూవీ టీమ్.

విశ్వంభర చిత్రం నుంచి త్రిష ఫస్ట్ లుక్‍ను టీమ్ రివీల్ చేసింది. ఆమె బర్త్‌డే సందర్భంగా పోస్టర్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో అవని పాత్రలో త్రిష కనిపించనున్నారని వెల్లడించింది. విషెస్ చెప్పింది.

విశ్వంభర చిత్రం విడుదల తేదీ

అద్భుతంగా ఉండే అవని పాత్రను త్వరలో చూస్తారంటూ విశ్వంభర ను ప్రొడ్యూజ్ చేస్తున్న యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిషకు విశ్వంభర టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. తేజస్సు, అద్బుతమైన నటనతో ఆమె అవని పాత్రకు జీవం తీసుకొచ్చారు. త్వరలో మెగా మాస్ బియాండ్ యూనివర్స్ థియేటర్లలోకి రానుంది” అని యూవీ క్రియేషన్స్ రాసుకొచ్చింది.

విశ్వంభర సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడింది. ఇప్పటి వరకు రిలీజ్‍పై క్లారిటీ రాలేదు. ఆలస్యమవుతూనే ఉంది. వీఎఫ్‍ఎక్స్ పనులు లేట్ అవుతుండడం, ఓటీటీ డీల్ విషయంలోనూ చర్చలు సాగుతుండడం వల్ల రిలీజ్ డేట్‍ను ఇంకా ఖరారు చేయలేకపోతోంది మూవీ టీమ్. జూలైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు అంచనాలు ఉన్నాయి. త్రిష పుట్టిన రోజు సందర్భంగా తీసుకొచ్చిన ఈ పోస్టర్‌లోనూ మూవీ టీమ్ రిలీజ్ గురించి ప్రస్తావించలేదు. దీంతో ఇంకా ఏ విడుదల తేదీపై క్లారిటీ రాలేదు.

త్రిష పాత్ర వివరాలు

విశ్వంభర సినిమాకు రూ.150కోట్లకుపైగానే బడ్జెట్ ఖర్చవుతోందని సమాచారం. వీఎఫ్ఎక్స్‌కే సుమారు సుమారు రూ.75కోట్లు అవుతోందట. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్, వంశీ, విక్రమ్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. బింబిసార మూవీతో భారీ హిట్ దక్కించుకున్న వశిష్ట దర్శకత్వవం వహిస్తుడడం కూడా ఈ మూవీపై అంచనాలను పెంచేసింది. ముల్లోకాల మధ్య సాగే కథతో ఈ చిత్రం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

విశ్వంభరలో చిరూకు జోడీగా త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత సుమారు 18 ఏళ్ల అనంతరం వీరు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అషికా రంగనాథ్, రమ్య కునాల్ కపూర్ కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన డెవోషనల్ సాంగ్ మంచి రెస్పాన్ తెచ్చుకుంది.

త్రిష పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం సంతోషదాయకం. చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.