|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: త్రిష, నయనతారపై తమిళ రాజకీయ నాయకుల దారుణ వ్యాఖ్యలు! దుమారం రేపుతున్న కామెంట్స్!

Published: 18-03-2026, 7:35 AM
షాకింగ్: త్రిష, నయనతారపై తమిళ రాజకీయ నాయకుల దారుణ వ్యాఖ్యలు! దుమారం రేపుతున్న కామెంట్స్!
  • త్రిష, విజయ్ ఎఫైర్ అంటూ బీజేపీ నేత సంచలన ఆరోపణలు, దుమారం!
  • నయనతార కావాలంటూ అన్నా డీఎంకే ఎంపీ దిగజారుడు వ్యాఖ్యలు, ఆగ్రహం వ్యక్తం!
  • సినిమా, రాజకీయం ముడిపడిన తమిళనాడులో హీరోయిన్లపై అసభ్యకర కామెంట్స్!
  • విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థులు!

తమిళనాడు రాజకీయాల్లో హీరోయిన్ల పేర్లు మారుమోగుతున్నాయి! రాజకీయ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి చదవండి!

త్రిష గురించి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

రాజకీయం అంటే ప్రజాసేవ. సమాజం పట్ల గౌరవం మర్యాదతో పాటు ఏ వర్గాన్ని, లింగాన్ని కించపరచకుండా ప్రజల పక్షాన నిలబడటం. కానీ తాజాగా దేశ రాజకీయాల్లో వస్తున్న కొత్త ధోరణులు అందరినీ ఆందోళన కలిగిస్తోంది. తమ ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు మహిళలను, సంబంధం లేని వారిని వివాదాల్లోకి లాగుతూ వారి పరువును బజారుకీడుస్తున్నారు. తాజాగా తమిళనాడులో హీరోయిన్ల పేరుతో సాగుతున్న రాజకీయ విమర్శలు దుమారం రేపుతున్నాయి. మహిళా యాక్టర్ల పట్ల రాజకీయ నేతల మాటలు శృతిమించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. దీంతో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రాజకీయ వేదికలు ఇలా వ్యక్తిగత దూషణకు అశ్లీల ప్రేలాపనలకు కేరాఫ్‍గా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషనే షెడ్యూల్ విడుదలైంది. ఇక్కడ సినిమాలు, రాజకీయాలు ఎప్పుడు కలగలిపి ఉంటాయి. సినీ రంగానికి చెందిన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు ముఖ్యమంత్రులుగా పని చేశారు. అనేక మంది సినిమా ప్రముఖులు రాజకీయాల్లో యాక్టివ్‍గా ఉన్నారు. తాజాగా తలపతి విజయ్ టీఎంసీ పార్టీని స్థాపించి ఏకంగా రాష్ట్ర రాజకీయాలను శాసించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో ప్రధాన పార్టీ నేతలు హీరోయిన్లపై దిగజారుడు మాటలు మాట్లాడటం తమిళనాడు పాలిటిక్స్ లో వివాదంగా మారుతోంది.

నయనతార కావాలంటూ ఎంపీ దిగజారుడు కామెంట్స్!

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం విజయ్ పార్టీ అందరిలో చర్చగా మారింది. ఇటువంటి తరుణంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకుడు నయినర్ నాగేంద్రన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ చీఫ్ విజయ్‍ని విమర్శించే క్రమంలో నాగేంద్రన్ శృతి మించిపోయారు. ముందు విజయ్ నటి త్రిషను విడిచిపెట్టాలి. ఆమె ఇంటిని వదిలి విజయ్ బయటకు రావాలి అంటూ త్రిషకు, విజయ్‍కు ఎఫైర్ అంటగట్టాడు. దీంతో నాగేంద్రన్‍పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో త్రిషకు సారీ చెప్పిన నాగేంద్రన్ తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వివాదం చల్లారక ముందే తాజాగా అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం ఎంకే స్టాలిన్ తీసుకువచ్చిన ఓ పథకాన్ని విమర్శిస్తూ.. నాకు హీరోయిన్ నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నోరు ఉంది కదా అని మీ రాజకీయాల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తారా? అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళ రాజకీయాల్లో హీరోయిన్ల పైనే ఫోకస్ ఎందుకు?

ఒకప్పుడు జయలలిత వంటి ధీరవనిత ముఖ్యమంత్రిగా ఏలిన రాష్ట్రంలో నేడు అదే పార్టీలకు చెందిన నేతలు మహిళల పట్ల నీచమైన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళా ఓటర్లందరికీ అవమానకరం అని తమ అభిమాన తారలను కించపరిస్తే మరి తమిళ ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఊరుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రాజకీయ చతురత కంటే వ్యక్తిగత దూషణలే అస్త్రాలుగా మారుతున్న వేళ, ఓటర్లు ఇలాంటి నోటి దురద నేతలకు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకులు చేస్తున్న ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.