
📌 Key Points
- విజయ్ సీఎం కాగానే త్రిష రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి సంచలనం సృష్టించింది.
- రజినీకాంత్, కమల్ హాసన్ నటించే చిత్రంలో త్రిష హీరోయిన్‌గా ఎంపికైంది.
- ఈ చిత్రాన్ని విజయ్ రాజకీయ ప్రత్యర్థి స్టాలిన్ కుమారుడు నిర్మిస్తుండటం హాట్ టాపిక్.
- త్రిష నిర్ణయం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సీఎం అవ్వగానే కోలీవుడ్, టాలీవుడ్ లో భారీ ప్రకంపనలు మొదలయ్యాయి! విజయ్ స్నేహితురాలు త్రిష తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఏం జరిగింది?
విజయ్ సీఎం.. త్రిష సంచలన నిర్ణయం!
తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన మొదటిసారే ఆయన గెలవడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. మదర్స్ డే రోజున సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే.. విజయ్ సీఎం రేసులో ఉన్నప్పటి నుంచి ఆయన స్నేహితురాలు, హీరోయిన్ త్రిష కృష్ణన్ హైలెట్ గా నిలిచారు. విజయ్ ప్రమాణ స్వీకారంలో కూడా కెమెరాలన్నీ త్రిష పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం విశేషం.
ఈ ఎన్నికల వేళే.. విజయ్ ఆయన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్రిష కోసమే భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ విడాకులు అయిపోతే ఆయన త్రిషను పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం కూడా జరుగుతోంది.. ఇలాంటి వార్త వేళ త్రిష తీసుకున్న నిర్ణయం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
రజినీ-కమల్ సినిమా.. స్టాలిన్ కుమారుడి నిర్మాణంలో!
రాజకీయంగా విజయ్ ప్రత్యర్థులతో త్రిష చేతులు కలిపిందంటూ వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ సినిమాల్లో హీరోయిన్ గా త్రిష నటించేందుకు అంగీకరించారు. రజినీ కాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్ బనిధి స్టాలిన్ నిర్మిస్తుండటం విశేషం. ఆయన ‘రెడ్ జెయింట్ మూవీస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాజకీయంగా స్టాలిన్, దళపతి విజయ్ ప్రత్యర్థులు. దీంతో విజయ్ ప్రత్యర్థితో త్రిష చేతులు కలపవచ్చా? అనే ప్రశ్న మొదలైంది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా.. అందులో రజినీ, కమల్ రెట్రో లుక్ లో కనిపించారు. తాజాగా హీరోయిన్ గా త్రిషను ప్రకటించారు. మరి త్రిష తీసుకున్న నిర్ణయం.. రాజకీయంగాా విజయ్ కి ఏవైనా సమస్యలు తీసుకువస్తోందో లేదో చూడాలి.
రాజకీయంగా విజయ్‌కి త్రిష షాక్?
ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రమని అంటున్నారు. త్రిష ఇదివరకే రజనీకాంత్‌తో ‘పేట’ సినిమాలో, కమల్ హాసన్‌తో ‘మన్మథన్ అంబు’, ‘తూంగ వనమ్’ వంటి సినిమాల్లో నటించారు.
త్రిష తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కోలీవుడ్ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విజయ్, త్రిష మధ్య భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియాలంటే, మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వేచి చూడండి!


