|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ గెలుపుపై త్రిష సెన్సేషనల్ రియాక్షన్! ఫ్యాన్ కామెంట్ కి ఊహించని నవ్వు.. నెట్టింట రచ్చ!

Published: 04-05-2026, 1:45 AM
విజయ్ గెలుపుపై త్రిష సెన్సేషనల్ రియాక్షన్! ఫ్యాన్ కామెంట్ కి ఊహించని నవ్వు.. నెట్టింట రచ్చ!
  • విజయ్ గెలుపు వార్తల మధ్య త్రిష తిరుపతి దర్శనం, నెట్టింట సెన్సేషనల్ టాపిక్ గా మారింది.
  • ఫ్యాన్ కామెంట్ కు త్రిష నవ్వుతో ఊహించని రియాక్షన్, సోషల్ మీడియాలో నిప్పు రాజేసింది.
  • త్రిష 42వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు, స్వామివారి ఆశీస్సులు అందుకుంది.
  • రాజకీయ ప్రవేశం, సినిమాల గుడ్‌బై వార్తలపై త్రిష క్లారిటీ, అభిమానులకు గుడ్ న్యూస్.

కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయ్ రాజకీయ ప్రవేశం, ఎన్నికల ఫలితాలపై త్రిష రియాక్షన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్. ఓ వైపు విజయ్ గెలుపు వార్తలు, మరోవైపు త్రిష తిరుపతి దర్శనం.. ఫ్యాన్ కామెంట్ కు ఆమె నవ్వు వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం!

విజయ్ విజయానికి త్రిష తిరుపతి ప్రయాణం!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఓ వైపు ఓట్ల లెక్కింపు జోరుగా జరుగుతోంది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల మేరకు విజయ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. సరిగ్గా.. విజయ్ టాప్ లో ఉన్న సమయంలోనే.. త్రిష తిరుపతిలో దర్శనానికి రావడం  హాట్ టాపిక్ గా మారింది. త్రిష తన పుట్టిన రోజు సందర్భంగానే తిరపతి వెళ్లినా.. ఇదే సమయంలో.. ఎన్నికల ఫలితాలు ఉండటం ఇప్పుడు  చర్చనీయాంశమైంది..

ఈ ఉత్కంఠ నడుమ, త్రిష తన తిరుపతి ప్రయాణం గురించి ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ముందుగానే హింట్ ఇచ్చారు.  కారులో ప్రయాణిస్తూ.. ‘తిరుపతి’ బోర్డును చూపించారు. ఆమె సుప్రభాత సేవ ద్వారా ఆ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఫ్యాన్ కామెంట్.. త్రిష నవ్వు వెనుక అసలు కథ!

ఆమె సుప్రభాత సేవ తర్వాత బయటకు వస్తున్న సమయంలో త్రిషను చూసి అక్కడ ఫ్యాన్స్ ఉత్సాహంగా పలకరించారు. అయితే.. అభిమానుల్లో ఒకరు.. ఎన్నికల గురించి కామెంట్ చేయడం విశేషం. ‘ రిజల్ట్ మనవైపే ఉంది’ అని ఒక అభిమాని గట్టిగా అరిచాడు. దానికి త్రిష.. ఎలాంటి కామెంట్ చేయకపోయినా… చిన్నగా నవ్వడం విశేషం. ఆమె నవ్వుతున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

త్రిష తన 42వ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు తిరుమల దర్శనానికి వచ్చారు. కాగా.. ఆమెకు సోషల్ మీడియాలో కూడా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  విజయ్ గెలుపు కోసమే త్రిష తిరుపతికి వెళ్లారని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, త్రిష నటించిన ‘కరుప్పు’ సినిమా మే 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె సూర్యకు జోడీగా నటించారు. ఆర్.జె. బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

కరుప్పు సినిమా, రాజకీయాలపై త్రిష క్లారిటీ!

త్రిష ప్రస్తుతం ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్‌బై చెబుతున్నారని ప్రచారం జరిగింది. అయితే, అవన్నీ వదంతులేనని ఆమె స్పష్టం చేశారు. అలాగే, త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. దాన్ని కూడా ఆమె ఖండిస్తూ, తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని తేల్చి చెప్పారు.

విజయ్ గెలుపు వార్తలు, త్రిష రియాక్షన్ తో కోలీవుడ్ లో సరికొత్త చర్చ మొదలైంది. ఈ సంఘటన త్రిష కెరీర్ కు ఎలాంటి మలుపునిస్తుందో చూడాలి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం మా ఛానెల్ ను ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.