|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ షాకింగ్ సీక్రెట్స్! హరీష్ శంకర్ సంచలన కామెంట్స్!

Published: 17-03-2026, 7:35 AM
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ షాకింగ్ సీక్రెట్స్! హరీష్ శంకర్ సంచలన కామెంట్స్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ గారి సహాయం: హరీష్ శంకర్ వెల్లడి!
  • పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు త్రివిక్రమ్ సమన్వయం కుదిర్చారు.
  • మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కానున్న ఉస్తాద్ భగత్ సింగ్.. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా!
  • OG షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట!

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త! త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో ఎలా కనెక్ట్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉస్తాద్ భగత్ సింగ్ లో త్రివిక్రమ్ గారి పాత్ర?

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది. మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ చిత్రం. దీనితో అప్పుడే అభిమానుల్లో హంగామా మొదలైంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక్కరే వన్ మ్యాన్ ఆర్మీలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హరీష్ శంకర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

హరీష్ శంకర్ మాటల్లో త్రివిక్రమ్ సహాయం!

దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా త్రివిక్రమ్ వేలు పెట్టారు అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ గారు కథ విని ఫైనల్ చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ సినిమా ముందుకు వెలుతుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఎంత అని హరీష్ శంకర్ ని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఉన్నప్పుడే నేను ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ నెరేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఓజీ షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. త్రివిక్రమ్ గారు కూడా అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు షాట్ కంప్లీట్ చేసుకుని వచ్చి హరీష్ స్టార్ట్ చేద్దామా అని అన్నారు.

పవన్, త్రివిక్రమ్ ల మధ్య సమన్వయం ఎలా?

వెంటనే త్రివిక్రమ్ గారు స్వామి సెలవు, మీరు కానివ్వండి అని అన్నారు. మీరు ఎక్కడికి వెళతారు సార్.. మీరు కూడా ఉండండి అని అడిగా. లేదు హరీష్.. మీరు కానివ్వండి అని చెప్పి ఆయన వెళ్లిపోయారు. కథ కూడా వినలేదు. అయినప్పటికీ త్రివిక్రమ్ గారి సాయం ఈ సినిమాకు ఉంది. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ మూడు సినిమాల కోసం ఒకేసారి షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చేది. ఆ టైంలో త్రివిక్రమ్ గారు నిర్మాతలు, పవన్ కళ్యాణ్ మధ్య సమన్వయం కుదిర్చి షూటింగ్స్ సవ్యంగా సాగేలా చేశారు అని హరీష్ తెలిపారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్ళీ చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.