
📌 Key Points
- వాషింగ్టన్ డీసీలో ట్రంప్, ఎప్‌స్టీన్ విగ్రహం కలకలం సృష్టించింది.
- టైటానిక్ ఫోజులో ఉన్న ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- ట్రంప్, ఎప్‌స్టీన్ సంబంధాలపై వ్యంగ్యంగా స్పందించిన కళాకారుల బృందం.
- విగ్రహంతో పాటు ‘మేక్ అమెరికా సేఫ్ ఎగైన్’ నినాదంతో బ్యానర్లు ఏర్పాటు.
వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ ల విగ్రహం సంచలనం సృష్టిస్తోంది. ‘టైటానిక్’ సినిమాలోని పోజులో ఉన్న ఈ విగ్రహం వారి వివాదాస్పద సంబంధాన్ని గుర్తు చేస్తూ రాజకీయ దుమారం రేపుతోంది.
టైటానిక్ పోజులో ట్రంప్, ఎప్‌స్టీన్ విగ్రహం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ ప్రాంతంలో బుధవారం ఒక వింత దృశ్యం ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ‘టైటానిక్’లోని ఐకానిక్ ఫోజును గుర్తుకు తెచ్చేలా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దివంగత లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ కలిసి ఉన్న ఒక భారీ విగ్రహం అక్కడ వెలిసింది. రాత్రికి రాత్రే ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాత వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం కలకలం రేపటడంతో పాటు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విగ్రహం వెనుక ఉన్న కళాకారుల బృందం
దాదాపు 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహానికి బంగారు రంగు (Spray-painted gold) వేయబడింది. టైటానిక్ సినిమాలో జాక్, రోజ్ షిప్ ముందు భాగంలో నిలబడినట్లే, ఇక్కడ ఎప్‌స్టీన్ ముందుండగా ట్రంప్ వెనుక నుండి పట్టుకున్నట్లుగా ఉంది. ఈ విగ్రహం కింద ఉన్న ఫలకాలపై రాసిన వాక్యాలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. ‘జాక్, రోజ్ మధ్య విషాద ప్రేమకథ విలాసవంతమైన ప్రయాణాలు, పార్టీలు, రహస్య నగ్న చిత్రాల (Nude sketches) మీద ఆధారపడి ఉంటే.. ఈ విగ్రహం ట్రంప్, ఎప్‌స్టీన్ మధ్య ఉన్న అటువంటి బంధాన్నే గుర్తు చేస్తోంది’ అని రాసి ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విగ్రహం
కేవలం విగ్రహమే కాకుండా, క్యాపిటల్ హిల్ మార్గంలో పది బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. వాటిపై ట్రంప్, ఎప్‌స్టీన్ కలిసి ఉన్న ఫోటోలతో పాటు ‘మేక్ అమెరికా సేఫ్ ఎగైన్’ అనే నినాదం రాసి ఉంది. ఈ విగ్రహం ఏర్పాటు వెనుక ‘సీక్రెట్ హ్యాండ్‌షేక్’ అనే అజ్ఞాత కళాకారుల బృందం ఉన్నట్లు భావిస్తున్నారు. రాజకీయ అంశాలపై వ్యంగ్యంగా స్పందించే ఈ బృందం, గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా ట్రంప్, ఎఎప్‌స్టీన్ చేతులు పట్టుకున్నట్లు ఉన్న విగ్రహాన్ని క్యాపిటల్ బయట ఉంచింది. తర్వాత అధికారులు దాన్ని వెంటనే తొలగించారు.
మొత్తానికి, ఈ విగ్రహం ట్రంప్ మరియు ఎప్‌స్టీన్ మధ్య సంబంధాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

