
📌 Key Points
- ఇరాన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటన.
- ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్‌లను పేల్చివేయాలని అమెరికా భావించింది.
- డీల్ కోసం ఇరాన్ తమకు ఫోన్ చేసిందని ట్రంప్ వెల్లడి.
- ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ భిన్నంగా స్పందించింది, చర్చలు జరగలేదంటోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో వ్యవహారంపై సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తమతో డీల్ కోసం సంప్రదించిందని, విద్యుత్ ప్లాంట్లను పేల్చేయాలని అనుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్ ప్రకటనలో కీలక అంశాలు
ఇరాన్ తో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తమతో డీల్ చేసుకోవాలని అనుకుంటోందని, ఇందులో భాగంగానే తమను సంప్రదించినట్లు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక ప్లాంట్స్ ను తాము పేల్చేయాలని అనుకున్నట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. 10 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టి దీనిని నిర్మించారని వివరించారు. ఇంత ఖర్చుతో నిర్మించిన విద్యుత్ ఉత్పాదక ప్లాంట్లను తాము ఒక్క దెబ్బతో కూల్చివేయగలమని ట్రంప్ హెచ్చరించారు. ఇది కూలిపోవాలని ఇరాన్ అనుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇరాన్ స్పందన
అందువల్లే ఇరాన్ వాళ్లు, డీల్ కోసం తమకు కాల్ చేసినట్లు పేర్కొన్నారు. మేం చేయలేదని వివరించారు. అయితే ఈ డీల్ నేపథ్యంలో ఇరాన్ కు సంబంధించిన ఓ ముఖ్య నాయకుడితో మాత్రమే చర్చలు జరిపినట్లు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీతో తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అదే సమయంలో ఇరాన్ మరో రకంగా స్పందిస్తోంది. తామేమి అమెరికాతో చర్చలు జరపలేదని పేర్కొంది. అయితే ట్రంప్ చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఇరాన్ దెబ్బకు అతడు భయపడిపోయాడని సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్స్ మొదలుపెట్టారు జనాలు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్స్
A post shared by The Tatva (@thetatvaindia)
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇరాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి.


