
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటోలో తల్లి, కూతురు ట్విన్స్ లా కనిపిస్తున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ చూడండి.
Key Points
మహిమ చౌదరి తన కూతురు అరియానాతో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.
తల్లీకూతుళ్ళు ట్విన్స్ లా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మహిమ చౌదరి 'మనసులో మాట' సినిమాతో పాపులర్ అయ్యింది.
క్యాన్సర్ నుంచి కోలుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చింది.
మహిమ చౌదరి కూతురు బర్త్‌డే
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్‌లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్‌డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?
ఫేమస్ సాంగ్.. తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి ( Mahima Chaudhry ). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన ‘మనసులో మాట’ సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.
ట్విన్స్ లా ఉన్న తల్లి కూతురు
కూతురి బర్త్‌డే.. తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్‌డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.
అందమైన కూతురు అరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్‌తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్‌లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది.
మహిమ చౌదరి సినిమా ప్రస్థానం
మహిమ చౌదరి తన కూతురితో కలిసి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఆరోగ్యంతో బాగుండి, మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.


