|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెండు గంటలు… ఏడు ప్రాజెక్ట్‌లు!

Published: 13-06-2025, 7:44 PM
రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్‌లు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన అద్భుతమైన పనితనంతో మళ్ళీ అందరినీ ఆశ్చర్యపరిచారు. రెండు గంటల్లో ఏడు ప్రాజెక్టులను పూర్తి చేసి, తన పని వేగాన్ని ప్రదర్శించారు.

Key Points

1

అమితాబ్ బచ్చన్ రెండు గంటల్లో ఏడు ప్రాజెక్టులు పూర్తి చేశారు.

2

ఐదు వాణిజ్య ప్రకటనలు మరియు రెండు ఫొటోషూట్లు చేశారు.

4

డైరెక్టర్ స్నేహితుడు ఆయన పని వేగాన్ని చమత్కారంగా ప్రశంసించాడు.

అమితాబ్ బచ్చన్ యొక్క అద్భుతమైన పని వేగం

ఎనిమిది పదుల వయసులో ఎంతో చురుకుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. వేగంగా పని చేయడం తనకు ఇష్టం అంటున్నారు ఈ బిగ్‌ బి. అందుకు ఉదాహరణగా ఇటీవల తాను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్‌లు (ఐదు వాణిజ్య ప్రకటనలు, రెండు ఫొటోషూట్‌లు) చేసిన విషయం గురించి చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్‌లు చేయడంతో నా డైరెక్టర్‌ ఫ్రెండ్‌ ఒకరు ‘ఇలా పని చేయడం సరి కాదు.

ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని నువ్వు రెండు గంటల్లో పూర్తి చేస్తే ఎలా? నువ్వు పని వి«ధానాన్నిపాడు చేస్తున్నావు. ఇలా చేస్తే క్లైంట్‌లు ఒకే రోజులో ఎక్కువ ప్రాజెక్ట్‌లు చేయమంటారు. అది కరెక్ట్‌ కాదు’ అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నాకు ఇలా స్పీడ్‌గా పని చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు అమితాబ్‌ బచ్చన్‌.

రెండు గంటల్లో ఏడు ప్రాజెక్టులు పూర్తి చేయడం

డైరెక్టర్ స్నేహితుని చమత్కారమైన ప్రశంసలు

అమితాబ్ బచ్చన్ వయసుతో సంబంధం లేకుండా తన పనితనం, శ్రద్ధతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారి పని వేగం అందరికీ స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.