|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉదయ్ కిరణ్ చనిపోవడమే బెటర్.. టాలీవుడ్ నటుడు సంచలనం !

Published: 08-07-2025, 1:45 PM
ఉదయ్ కిరణ్ చనిపోవడమే బెటర్.. టాలీవుడ్ నటుడు సంచలనం !

టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య టాలీవుడ్ ని షాక్ చేసింది. తాజాగా బిగ్ బాస్ విజేత కౌశల్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. ఉదయ్ కిరణ్ చనిపోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

Key Points

1

టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య.

2

బిగ్ బాస్ విజేత కౌశల్ సంచలన వ్యాఖ్యలు.

4

ఇండస్ట్రీలోని ఒత్తిళ్లను కౌశల్ ప్రస్తావించడం.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

టాలీవుడ్ సీనియర్ హీరో ఉదయ్ కిరణ్ ( UDAY KIRAN) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రేంజ్ లో.. ఇండస్ట్రీని ఏలాడు ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ లేకపోయినా.. చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ… స్టార్ హీరో అయ్యాడు. చిత్రం, నువ్వు నేను, నీ స్నేహం, మనసంతా నువ్వే, లాంటి ఎన్నో ప్రేమకథా చిత్రాలు తీసి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే అలాంటి ఉదయ్ కిరణ్.. 33 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకొని అందరిని వదిలి వెళ్ళిపోయాడు.

కౌశల్ సంచలన వ్యాఖ్యలు

ఆయన కెరీర్… ఓ రేంజ్ లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే దీనికి పై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ( Koushal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ బతకడం కంటే.. చనిపోవడం మంచిదైంది అంటూ బాంబు పేల్చాడు. తాను 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను… ఇక్కడ ఎదుగుతున్న వాళ్లను తొక్కేస్తూ ఉంటారు అని పేర్కొన్నాడు.

ఇండస్ట్రీ ఒత్తిళ్లు

ఉదయ్ కిరణ్ ను కూడా మానసికంగా చాలా వేధించారు… నేను దగ్గరుండి చూశాను అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు కౌశల్. అలాంటి టార్చర్ తో బతకడం కంటే చనిపోవడం మంచిదేమో.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి దక్కుతుందని ఆశిస్తున్నట్లు ఎమోషనల్ అయ్యాడు.

కౌశల్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. ఉదయ్ కిరణ్ మరణం వెనుక ఉన్న కారణాలపై మరింత చర్చ జరగడం ఖాయం. ఇండస్ట్రీలోని ఒత్తిళ్ల గురించి మళ్ళీ చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.