|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పవన్ సినిమాపై ఉదయ్ కిరణ్ చివరి మాటలు! వీఎన్ ఆదిత్య సంచలన విషయాలు!

Published: 16-02-2026, 7:35 AM
షాకింగ్: పవన్ సినిమాపై ఉదయ్ కిరణ్ చివరి మాటలు! వీఎన్ ఆదిత్య సంచలన విషయాలు!
  • ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు వీఎన్ ఆదిత్యతో మాట్లాడారు.
  • పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా గురించి ఉదయ్ సంతోషం వ్యక్తం చేశారు.
  • ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేద్దామని ఉదయ్ కిరణ్ ఆదిత్యతో అన్నారు.
  • ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

ఉదయ్ కిరణ్ మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా ఆయన గురించిన వార్తలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, ఉదయ్ కిరణ్ చివరి మాటల గురించి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆయన మాట్లాడారని తెలిపారు.

ఉదయ్ కిరణ్ చివరి మాటలు

Uday Kiran: ఉదయ్ కిరణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటనతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.. ఎంత తొందరగా అయితే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారో అంతే తొందరగా తన జీవితాన్ని కూడా కోల్పోయారు. సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న ఉదయ్ కిరణ్ (Uday Kiran)ఆత్మహత్య చేసుకుని మరణించడం ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేని విషయం. ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు ఒకటిన్నర దశాబ్దమవుతున్న ఇప్పటికీ ఈయనకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇకపోతే వాలెంటైన్స్ డే సందర్భంగా ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మనసంతా నువ్వే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉదయ్ కిరణ్ చివరి మాటలను ఆయన తెలియజేశారు. ఉదయ్ కిరణ్ మరొక వారం రోజులలో సూసైడ్ చేసుకొని చనిపోతారన్న సమయంలో తనకు ఫోన్ చేశారని అదే సమయంలో అత్తారింటికి దారేది సినిమా విడుదల కావడంతో గంటల తరబడి మేమిద్దరం మాట్లాడుకున్నామని వీఎన్ ఆదిత్య తెలిపారు.

అత్తారింటికి దారేది సినిమా గురించి ఉదయ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఉదయ్ కిరణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేద్దాము మంచి కథ చూడండి అంటూ ఈ సినిమా గురించి తనతో చాలాసేపు మాట్లాడారని డైరెక్టర్ విఎన్ ఆదిత్య గుర్తు చేసుకున్నారు. అయితే ఈ ఫోన్ కాల్ తర్వాత వారం రోజులకే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు అంటూ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్ తో తాను చివరిగా మాట్లాడిన మాటలు ఇవేనని ఆదిత్య గుర్తు చేసుకున్నారు అయితే ఆ సమయంలో ఆయన చాలా సంతోషంగా సరదాగా మాట్లాడారు అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నారంటే నమ్మశక్యంగా లేదని తెలిపారు. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అనేది ఇప్పటికి ఒక మిస్టరీ గానే ఉండిపోయిందని చెప్పాలి అసలు ఎందుకు ఈయన ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. ఉదయ్ కిరణ్ మరణం గురించి ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉన్నాయి. ఉదయ్ కిరణ్ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది తొక్కేసే ప్రయత్నాలు చేశారని, ఈ విషయంలో డిప్రెషన్ కి గురైన ఈయన ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి.ఏది ఏమైనా ఇలాంటి ఒక గొప్ప నటుడి మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయిందనే చెప్పాలి.

ఉదయ్ కిరణ్ మరణం మిస్టరీ

ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికి ఒక మిస్టరీగానే కొనసాగుతోంది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి. ఈ విషయంపై ఇంకా అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.