|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను రీప్లేస్‌ చేయడానికి పది మంది యాంకర్లని మార్చారు.. టీవీ షోస్‌లో రియాలిటీ బయటపెట్టిన ఉదయభాను

Published: 17-08-2025, 7:20 AM
నన్ను రీప్లేస్‌ చేయడానికి పది మంది యాంకర్లని మార్చారు.. టీవీ షోస్‌లో రియాలిటీ బయటపెట్టిన ఉదయభాను

ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది. ఆమె ‘రేలా రేలా రే’, ‘ఢీ’ వంటి షోలలో తన పాత్రను వివరిస్తూ, రియాలిటీ షోల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టింది.

Key Points

1

ఉదయభాను తన యాంకరింగ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

2

‘రేలా రేలా రే’ మరియు ‘ఢీ’ షోలలో ఆమె పాత్రను ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారని తెలిపింది.

4

ఇప్పుడు రియాలిటీ షోలు చేయడంపై ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఉదయభాను యొక్క టీవీ ప్రస్థానం

యాంకర్‌ ఉదయభాను ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణించింది. శ్రీముఖి, అనసూయ, రష్మిలు రావడానికి ముందే ఆమె బుల్లితెరని శాసించింది. అనేక షోస్‌ చేసి మెప్పించింది. యాంకర్‌ సుమకి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, ఆమెని డామినేట్‌ చేసింది కూడా. కానీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆమె యాంకరింగ్‌ మానేసింది. కొంత కాలం టీవీకి దూరంగా ఉంది. అయితే అప్పట్లో యాంకర్‌గానే కాదు, నటిగానూ అలరించింది. స్పెషల్‌ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది.

కొంత కాలం అన్నింటికి దూరంగా ఉన్న ఉదయభాను గత కొన్ని రోజుల క్రితం మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యింది. ఇప్పుడు అడపాదడపా టీవీ షోస్‌తో మెప్పిస్తోంది. ఈ క్రమంలో యాంకర్‌గానే కాదు, నటిగానూ అలరించేందుకు వస్తోంది. తాజాగా ఆమె `బార్బరిక్‌` అనే సినిమాలో నటించింది. సత్యరాజ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకుంది. రియాలిటీ షోస్‌ గురించి ఓపెన్‌ అయ్యింది ఉదయభాను.

రియాలిటీ షోల వెనుక నిజం

తాను అప్పట్లో చేసిన ప్రతి షోలోనూ తన మార్క్ వేశానని తెలిపింది ఉదయభాను. `రేలా రేలా రే` షోలో తన మార్క్ ఉంటుందని, దాన్ని ఎవరూ రీప్లేస్‌ చేయలేకపోయారని చెప్పింది. ఎన్ని షోస్‌ వచ్చినా అది అలా నిలిచిపోయిందని, అలాగే `ఢీ` షో చేశానని, తాను వెళ్లిపోయాక తన ప్లేస్‌ భర్తీ చేయడానికి పది మంది యాంకర్లని మార్చాల్సి వచ్చిందని చెప్పింది ఉదయభాను. ఇలా ప్రతి షోలోనూ తన మార్క్ ఉంటుందని వెల్లడించింది.

అదే సమయంలో రియాలిటీ షోస్‌లో రియాలిటీ ఎంత ఉంటుందో బయటపెట్టింది. ఒకప్పుడు రియాలిటీగా ఇలాంటి రియాలిటీ షోస్‌ ఉండేవని, కానీ ఇప్పుడు అంతా స్క్రిప్టెడ్‌ అని చెప్పింది. వెనకాల ఇయర్‌ ఫోన్స్ పెట్టుకొని ఓ వ్యక్తి ఉంటాడని, ఎప్పుడు ఏ డైలాగ్‌ చెప్పాలో అతనే నిర్ణయిస్తాడని, ఆయన చెప్పిన్నట్టు మనం చేయాలని, ఒక డైలాగ్‌ చెప్పాలన్నా, నవ్వాలన్నా, ఏడవాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. మొత్తం స్క్రిప్టెడ్‌ అని, తాను ఇలాంటి ఇయర్‌ ఫోన్స్ లేని సమయంలో యాంకర్‌గా చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

ఉదయభాను భవిష్యత్తు ప్రణాళికలు

ఇప్పుడు రియాలిటీ షోస్‌ చేయాల్సి వస్తే చేస్తారా? అని యాంకర్‌ ప్రశ్నించగా, ఇటీవల తాను రెండు షోస్‌ చేశానని, ఆ తర్వాత రియలైజ్‌ అయ్యానని తెలిపింది. మనకు చెప్పే వ్యక్తికి ఒక క్యారెక్టర్‌ ఉండాలని తెలిపింది ఉదయభాను. అదే సమయంలో అప్పట్లో తాను ఎక్కువగా రియాలిటీ షోస్‌ చేసి మెప్పించిన నేపథ్యంలో బాగా పారితోషికం తీసుకునే యాంకర్‌గా రాణించింది. దీనిపై ఆమె స్పందిస్తూ, తనుపై అలాంటి పేరు పడిపోయిందని, కానీ ఈ షోస్‌ వాళ్లు ఇచ్చిన చెక్కులు చాలా బౌన్స్ అయ్యానని, ఎంతో మంది మనీ ఎగ్గొట్టారని తెలిపింది. ఆ బౌన్స్ అయిన చెక్కులు చూస్తే తోరణాలు కట్టుకోవచ్చు అని చెప్పింది ఉదయభాను. తాను ఇతర షోస్‌ ద్వారా సంపాదించానని వెల్లడించింది. తాజాగా ఉదయభాను కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

చివరగా, ఉదయభాను తన అనుభవాలను పంచుకోవడం ద్వారా టీవీ రంగానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె అభిప్రాయాలు అనేకమందికి ఆలోచింపజేస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.