|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Udhayanidhi Stalin: బిగ్‌బాస్‌ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు.. రీపోస్ట్‌ చేసిన తమిళ డిప్యూటీ సీఎం!

Published: 22-10-2025, 6:19 AM
Udhayanidhi Stalin: బిగ్‌బాస్‌ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు.. రీపోస్ట్‌ చేసిన తమిళ డిప్యూటీ సీఎం!

తమిళ డిప్యూటీ సీఎం, హీరో ఉదయనిధి స్టాలిన్ చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ నివాశియ్ని కృష్ణన్ గ్లామర్ ఫోటోలను ఆయన రీపోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసినా, ఆ స్క్రీన్‌షాట్లు వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Key Points

1

తమిళ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బిగ్‌బాస్ బ్యూటీ నివాశియ్ని కృష్ణన్ గ్లామర్ ఫోటోలు రీపోస్ట్ చేశారు.

2

నివాశియ్ని కృష్ణన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలను ఉదయనిధి రీపోస్ట్ చేశారు.

4

నెటిజన్లు ఉదయనిధిపై ట్రోలింగ్‌కు పాల్పడుతుండగా, ఆయన అభిమానులు మాత్రం సమర్థిస్తున్నారు.

ఉదయనిధి చేసిన పొరపాటు!

పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్‌ బారిన పడటం ఖాయం! బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి, మోడల్‌ నివాశియ్ని కృష్ణన్‌ ( Nivaashiyni Krishnan ) గ్లామర్‌ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ( Udhayanidhi Stalin ) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రీపోస్ట్‌ చేశారు.

చిన్న తప్పిదం! ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్‌ పోస్ట్‌కు కామెంట్లను ఆఫ్‌ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్‌ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

నెట్టింట వైరల్ అవుతున్న నివాశి గ్లామర్ ఫోటోలు

ఎవరా బ్యూటీ? అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్‌ అయి అలా రీపోస్ట్‌ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్‌లో మోడల్‌గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో కామనర్‌గా పాల్గొంది. ఓహో ఎంతన్‌ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్‌ చేసింది.

ఎవరీ బిగ్‌బాస్‌ బ్యూటీ నివాశి?

ఉదయనిధి స్టాలిన్ పొరపాటున రీపోస్ట్ చేసినా, జరిగిన తప్పును నెటిజన్లు వదలడం లేదు. ఆయన అభిమానులు సమర్థిస్తున్నా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ ఘటన సెలబ్రిటీలకు ఒక గుణపాఠం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.