|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇదేం ట్విస్ట్ – థియేట్రిక‌ల్‌ రిలీజ్ క్యాన్సిల్ – డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న బాలీవుడ్ మూవీ – కార‌ణం ఏమిటంటే?

Published: 08-05-2025, 3:44 AM
ఇదేం ట్విస్ట్ - థియేట్రిక‌ల్‌ రిలీజ్ క్యాన్సిల్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న బాలీవుడ్ మూవీ - కార‌ణం ఏమిటంటే?

రాజ్ కుమార్ రావ్ నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ సినిమా థియేట్రికల్ రిలీజ్ రద్దు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మేకర్స్ ఓటీటీ రిలీజ్‌కు మారారు. దేశంలోని పరిస్థితులే దీనికి కారణమని తెలిపారు.

Key Points

1

రాజ్‌కుమార్ రావ్‌, వామికా గ‌బ్బి నటించిన 'భూల్ చుక్ మాఫ్' థియేట్రికల్ రిలీజ్ రద్దు.

2

మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.

4

వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ కామెడీ డ్రామా.

థియేట్రికల్ రిలీజ్ రద్దు

రాజ్‌కుమార్ రావ్‌, వామికా గ‌బ్బి హీరోహీరోయిన్లుగా న‌టించిన భూల్ చుక్ మాఫ్ మూవీ మే 9న థియేట‌ర్ల‌లో రిలీజ్ కావాల్సింది. రిలీజ్‌కు మ‌రో రోజు ఉండ‌గా మేక‌ర్స్ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. భూల్ చుక్ మాఫ్ మూవీ థియేట్రిక‌ల్ రిలీజ్‌ను క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డైరెక్ట్‌ గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో భూల్ చుక్ మాఫ్‌ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సినిమాను థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నామ‌ని, కానీ దేశంలో నెల‌కొన్న తాజా ప‌రిణామాలు, సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నేప‌థ్యంలో త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకొని ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది.

ఓటీటీలోకి ప్రయాణం

రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న భూల్ చుక్ మాఫ్ మూవీకి క‌ర‌ణ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ మాజీ భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. టింగ్ లింగ్ సంగ అనే ఈ పాట‌ను బుధ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

భూల్ చుక్ మాఫ్ మూవీ వార‌ణాసి బ్యాక్‌డ్రాప్‌లో సాగ‌నుంది. రంజ‌న్, టిట్లి మిశ్రా ప్రేమించుకుంటారు. ప్ర‌భుత్వ ఉద్యోగం సాధిస్తేనే త‌న కూతురిని ఇచ్చి పెళ్లిచేస్తాన‌ని టిట్లి మిశ్రా తండ్రి కండీష‌న్ పెడ‌తాడు. అత‌డు కోరిన‌ట్లే ప్ర‌భుత్వ ఉద్యోగం సాధిస్తాడు రంజ‌న్‌. హ‌ల్ధీ వేడుక రోజు త‌న జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ నిజం రంజ‌న్‌కు తెలుస్తుంది? అదేమిటి దాని వ‌ల్ల అత‌డు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? 30వ తేదీకి రంజ‌న్ పెళ్లికి ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ శ‌ర్మ ఈ మూవీని రూపొందించారు.

కారణాలు మరియు వివరాలు

భూల్ చుక్ మాఫ్ మూవీని దినేష్ విజ‌న్ ప్రొడ్యూస్ చేశారు. త‌నీష్ భాగ్చి, కేథ‌న్ సోధా మ్యూజిక్ అందించారు. తొలుత ఈ మూవీలో కార్తీక్ ఆర్య‌న్‌, శ్ర‌ద్ధా క‌పూర్ హీరోహీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ప‌రిమితం కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్నాడు రాజ్‌కుమార్ రావ్‌. అత‌డు హీరోగా గ‌త ఏడాది రిలీజైన‌ హార‌ర్ కామెడీ మూవీ స్త్రీ 2 బాలీవుడ్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. 870 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శ్రీకాంత్ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ది. గ‌త ఏడాది హీరోగా నాలుగు సినిమాలు చేశాడు రాజ్‌కుమార్ రావ్‌.

దేశంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, ‘భూల్ చుక్ మాఫ్’ ఓటీటీ రిలీజ్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించినప్పటికీ, ప్రేక్షకులకు మంచి అనుభవం అందించే ప్రయత్నంగా భావించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.