
📌 Key Points
- అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి.
- పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి సురేష్ గోపి వెల్లడి.
- ముడిచమురు కొనుగోలు, రవాణా, నిల్వ, శుద్ధి ప్రక్రియలకు సమయం పడుతుంది.
- విదేశీ మారకం, పన్నులు, రవాణా ఖర్చులు కూడా ధరల నిర్ణయంలో ప్రభావం చూపుతాయి.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గవని కేంద్రమంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. ధరల నిర్ణయంలో అనేక ఇతర అంశాలు ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం
అమెరికా – ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో భారత్ లో గత నెలలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తూ.. కేంద్రం ఎప్పుడెప్పుడు ప్రకటన చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై చర్చ కూడా జరుగుతోంది. తాజాగా ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి సురేష్ గోపి కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినంత మాత్రానద దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించలేమని ఆయనస్పష్టం చేశారు. ముడిచమురు సరఫరా పరిస్థితుల్ని సమీక్షించాకే ఇంధన ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చమురు కొనుగోలు, రవాణా, నిల్వలు, శుద్ధి ప్రక్రియలకు సమయం పడుతుందని తెలిపారు. దేశంలో ముడిచమురు లభ్యత, సరఫరా పరిస్థితుల్ని కేంద్రపెట్రోలియం శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన సమయంలో ధరలపై కచ్చితంగా సమీక్ష చేస్తామన్నారు. అయితే.. ఇంధన ధరల నిర్ణయం కేవలం అంతర్జాతీయ ముడిచమురు ధరలతోనే ముడిపడి ఉండదని, విదేశీ మారకం విలువ, పన్నులు, రవాణా ఖర్చులు వంటి అంశాలు కూడా పరిగణలోకి వస్తాయన్నారు.
ఇంధన ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి వివరణ
ధరల నిర్ణయంలో కీలక అంశాలు
మొత్తంగా, ఇంధన ధరల తగ్గింపుపై ప్రజల ఆశలు ప్రస్తుతానికి నెరవేరడం కష్టమని కేంద్రమంత్రి ప్రకటనతో స్పష్టమైంది. ముడిచమురు సరఫరా పరిస్థితులు, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు.


