|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

Published: 22-07-2025, 5:16 PM
యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

‘మార్కో’ ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ప్రకటించబడింది. దర్శకుడు జోషి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఉన్ని ముకుందన్ ఫిలింస్ మరియు ఐన్‌స్టీన్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Key Points

1

ఉన్ని ముకుందన్ హీరోగా కొత్త యాక్షన్ సినిమా

2

దర్శకుడు జోషి దర్శకత్వం వహించనున్నారు

4

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది

ఉన్ని ముకుందన్ కొత్త సినిమా

‘మార్కో’ మూవీ ఫేమ్‌ ఉన్ని ముకుందన్‌ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దర్శకుడు జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఉన్ని ముకుందన్‌ ఫిలింస్‌ (యుఎమ్‌ఎఫ్‌)– ఐన్‌స్టీన్‌ మీడియా బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది. దర్శకుడు జోషి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు మేకర్స్‌. ‘‘హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది.

జోషి డైరెక్షన్ లో వచ్చిన పలు చిత్రాలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆ అనుభవంతో ఈ తరం స్టోరీ టెల్లింగ్‌ పవర్‌తో ఒక భారీ యాక్షన్‌ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నారాయన. తన కెరీర్‌లో ఎప్పుడూ చూడని లుక్‌లో, మాస్‌ యాక్షన్‌ పాత్రలో కనిపించబోతున్నారు ముకుందన్‌. యుఎమ్‌ఎఫ్‌– ఐన్‌స్టీన్‌ మీడియా  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా బిగ్‌ పాన్‌ ఇండియా ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోంది’’ అని చిత్రబృందం తెలిపింది.

జోషి దర్శకత్వం

పాన్ ఇండియా విడుదల

చిత్ర బృందం ఈ చిత్రం ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిపింది. ఉన్ని ముకుందన్ కొత్త లుక్ మరియు మాస్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.