|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రామ్ చరణ్ కూతురితో ఉంటే అంతే సంగతులు.. ఉపాసన ఫైర్!

Published: 11-04-2026, 8:05 AM
షాకింగ్: రామ్ చరణ్ కూతురితో ఉంటే అంతే సంగతులు.. ఉపాసన ఫైర్!
  • రామ్ చరణ్‌తో క్లీంకార ఆడుకుంటే ఉపాసనకు జెలసీ అట!
  • కూతురుతో చరణ్ అనుబంధం చూసి మురిసిపోతున్న ఉపాసన.
  • భర్త మనసు వెన్న అని పొగిడిన ఉపాసన.
  • చరణ్ ఫన్నీ వ్యక్తి అని ఉపాసన కామెంట్.

మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త! రామ్ చరణ్ మరియు ఉపాసనల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని ఉపాసన బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్దాం!

కూతురితో రామ్ చరణ్.. ఉపాసన అసూయ!

రామ్‌ చరణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది అరెంజ్‌ మ్యారేజ్‌ అని అంతా అనుకున్నా, తెరవెనుక మంచి లవ్‌ స్టోరీనే ఉంది. ఇద్దరు కలిసి అర్థరాత్రిళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. వీరి ప్రపోజల్‌ని పెద్దలు ఒప్పుకుని పెళ్లి చేశారు. వీరికి మూడేళ్ల క్రితం కూతురు క్లీంకార జన్మించగా, ఇటీవల ట్విన్స్ జన్మించారు. ఈ ట్విన్స్ లో ఒక పాప, బాబు ఉన్నారు. ఓ వైపు ఫ్యామిలీ, పిల్లల్ని చూసుకుంటూనే తన వ్యాపారాలు మెయింటేన్‌ చేస్తుంది ఉపాసన. ఆ విషయంలో ఆమె చాలా ప్రొఫేషనల్‌గా ఉంటుంది.

రామ్‌ చరణ్‌ సినిమాల్లో ఉన్నారు. ఆయన సినిమాకి సినిమాకి ఒక్కో హీరోయిన్‌తో కలిసి నటిస్తుంటారు. రొమాన్స్ చేస్తుంటారు. డ్యూయెట్లు పాడుకుంటారు. ఇవన్నీ చూస్తే ఆడియెన్స్ కి కనువిందుగా ఉంటుంది. వాటిని ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తారు. అయితే హీరోయిన్ల విషయంలో చరణ్‌ భార్య ఉపాసన పెద్దగా జెలసీ ఫీలవ్వదు. దాన్ని పెద్దగా పట్టించుకోదు. అది వృత్తిలో భాగమనే విషయాన్ని ఆమె కూడా నమ్ముతుంది. కానీ ఒక్కరి విషయంలో మాత్రం ఉపాసన చాలా జెలసీ ఫీలవుతుందట. రామ్‌ చరణ్‌ ఆమెతో కనిపిస్తే చాలు ఇక అంతే రచ్చరచ్చే అట.

చరణ్ గురించి ఉపాసన ఏమన్నారంటే..

మరి ఉపాసనకి జెలసీ ఫీలింగ్‌ తెప్పించే ఆ అమ్మాయి ఎవరనేది చూస్తే ఆశ్చర్యపోతారు. ఆమె ఎవరో కాదు.. తమ కూతురు క్లీంకార. రామ్‌ చరణ్‌ ఇంట్లో ఎక్కువగా తన కూతురు క్లీంకారతోనే ఆడుకుంటాడట. ఆ పాప కూడా తండ్రితోనే ఉండేందుకు ఇష్టపడుతుందట. ఆయనతోనే ఆడుకుంటుందట. వారిద్దరి బాండింగ్‌ని చూస్తే ఉపాసనకు జెలసీ కలుగుతుందట. వారిద్దరి గురించి అడిగితేనే `నో వారి గురించి అడగొద్దు, నాకు చాలా జెలసీ` అని చెప్పింది ఉపాసన. రామ్‌ చరణ్‌.. కూతురుతో ఎంత ప్రేమగా ఉంటాడో, ఆమెని ఎంత బాగా చూసుకుంటాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. కూతురు విషయంలో ప్రేమతో కూడిన జెలసీని వెల్లడించింది ఉపాసన. ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది.

మెగా ఫ్యామిలీలో కొత్త కబుర్లు!

రామ్‌ చరణ్‌ గురించి చెబుతూ, తనది దయతో కూడిన మనసు అని, ఆయనలో తనకు నచ్చే గుణం ఏంటంటే.. మనం చెప్పేది కూల్‌గా వింటాడని, ఏం చెప్పినా వింటాడని, మనం చెప్పడం అయిపోయిన తర్వాతనే మాట్లాడతాడని తెలిపింది. తను ఇంట్లో చాలా ఫన్నీ పర్సన్‌ అని చెప్పింది. తన గురించి బాగా ఆలోచిస్తాడని  వెల్లడించింది. భర్తపై ప్రశంసలు కురిపించింది. ఇక రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌`తో పెద్ద డిజాస్టర్‌ని అందుకున్నాడు. ఇప్పుడు `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదల కాబోతుంది. అయితే షూటింగ్‌ డిలే కారణంగా ఇది మరోసారి వాయిదా పడుతుందని, జూన్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసనల మధ్య అనుబంధం గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.