
📌 Key Points
- పెళ్లి తర్వాత రామ్ చరణ్ వేరే కాపురం పెట్టాలనుకున్నా, ఉపాసన కోరిక మేరకు నిర్ణయం మార్చుకున్నాడు.
- ఉపాసన ఉమ్మడి కుటుంబానికి విలువ ఇవ్వడం చూసి చరణ్ ఆశ్చర్యపోయాడు, ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు.
- వారం చివరలో మాత్రమే వేరే ఇంట్లో ఉంటామని, మిగిలిన రోజులు తల్లిదండ్రులతోనే గడుపుతామని చరణ్ స్పష్టం చేశాడు.
- ఉపాసన ఆలోచనలు, సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలకు చరణ్ ఎంతో ప్రాధాన్యతనిస్తాడని వెల్లడించింది.
మెగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్! రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి తర్వాత జరిగిన ఒక సంచలన విషయాన్ని ఉపాసన స్వయంగా బయటపెట్టింది. ఆ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి! పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి!
పెళ్లి తర్వాత చరణ్ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?
రామ్ చరణ్ ఇటీవలే రెండోసారి తండ్రి అయ్యారు. చరణ్, ఉపాసనలకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. మొదట కూతురు క్లీంకార జన్మించగా, ఆ తర్వాత ఇటీవల కవలలు కొడుకు, కూతురు జన్మించారు. వీరికి శివ్‌రామ్, అన్వీరా దేవిగా నామకరణం చేశారు. వీరి పుట్టుక, నామకరణం అంతా ఒక సెలబ్రేషన్ లాగా సాగింది. మొత్తానికి చిరంజీవి కోరుకున్నట్టుగానే ఆయన ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడు. ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
ఈ క్రమంలో రామ్ చరణ్ పెళ్లికి ముందు జరిగిన ఒక సంఘటన బయటకు వచ్చింది. ఉపాసన ఓ క్రేజీ రహస్యాన్ని వెల్లడించింది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకి దూరంగా ఉండాలనుకున్నారట. కానీ ఉపాసన చెప్పిన మాటతో మొత్తం మారిపోయింది. అసలేం జరిగిందంటే.. పెళ్లికి ముందే రామ్‌చరణ్, ఉపాసన ప్రేమించుకున్నారు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. కలిసి తిరిగిన రోజులు చాలానే ఉన్నాయి. అర్థరాత్రి సమయంలో వీరిద్దరు రైడ్‌కి వెళ్లేవారట. రామ్ చరణ్ చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చేవారట. అవి తనని బాగా ఇంప్రెస్ చేసేవని తెలిపింది ఉపాసన.
ఉమ్మడి కుటుంబంపై ఉపాసన మనసులోని మాట ఏమిటో తెలుసా?
అయితే ఓరోజు `పెళ్లి అయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామని రామ్‌చరణ్ ని ప్రశ్నించింది ఉపాసన. దీంతో చరణ్ వెంటనే తాను కొన్నస్థలం గురించి చెప్పి, అక్కడ ఇళ్లు కడతా అని చెప్పాడట. అక్కడే ఉండొచ్చు అని ఆయన వెల్లడించారు. దీంతో ఉపాసన కాసేపు సైలెంట్ అయ్యింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఉపాసన తట్టుకోలేక తన మనసులో మాట చెప్పేసింది. పెళ్లి అయిన వెంటనే కుటుంబాన్ని వదిలేసి విడిగా ఎలా ఉండగలుగుతారు అని అడిగిందట. తాను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఒంటరిగా ఉండటం తనకు ఇష్టంలేదు, అందుకే అడిగిందట.
దీనికి రామ్ చరణ్ స్పందించి వెంటనే అసలు విషయం చెప్పారు. వీకెండ్‌లోనే ఈ ఇంట్లో ఉంటామని, మిగిలిన రోజులు పేరెంట్స్ తోనే ఉంటామని చెప్పాడట. దీంతో తన మనసు కుదుట పడిందని తెలిపింది ఉపాసన. తన ఆలోచనలు, సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబానికి విలువ ఇవ్వడం చరణ్‌కి బాగా నచ్చుతాయని చెప్పింది. `అన్నింటినీ నిర్వహించడంలో నువ్వు చాలా సమర్థురాలివి` అని అంటుంటాడు చరణ్. తనలోనూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. చాలా మంది ఎదుటి వాళ్లకు చెప్పే అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. కానీ తను అలా కాదు, ఎదుటివాళ్లు చెప్పేది ఓపికగా వింటాడు. వాళ్లు చెప్పడం అయిపోయిన తర్వాతనే తన అభిప్రాయం చెబుతుంటాడు. ఏం మాట్లాడాలని ఆలోచించుకొని మాట్లాడుతుంటాడు. నా విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు` అని చెప్పింది ఉపాసన. రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు ఉపాసన.
చరణ్ తీసుకున్న నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది?
రామ్‌చరణ్ ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మూవీపై మంచి బజ్ ఉంది. రామ్ చరణ్ నటించిన గత సినిమా `గేమ్ ఛేంజర్` డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో `పెద్ది`తో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
రామ్ చరణ్, ఉపాసనల జీవితంలోని ఈ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మెగా న్యూస్ ఎప్పుడూ మీతోనే!


