|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రేపే ఉపాసన కవలల జననం! రాముడి నక్షత్రంలో మెగా వారసుల ఎంట్రీతో రికార్డులు బద్దలు!

Updated: 29-01-2026, 11:44 PM
షాకింగ్: రేపే ఉపాసన కవలల జననం! రాముడి నక్షత్రంలో మెగా వారసుల ఎంట్రీతో రికార్డులు బద్దలు!
  • ఉపాసనకు కవలలు పుట్టబోతున్న శుభవార్త! మెగా అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.
  • జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనివ్వనున్నట్లు సమాచారం – మెగా వారసుల రాక కోసం ఎదురుచూపు!
  • రాముడు పుట్టిన పునర్వసు నక్షత్రంలో మెగా వారసులు జన్మించనుండటం విశేషం! ఇది మెగా అభిమానులకు పండుగే.
  • మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజనేయుడు, ఆయన దైవం రాముడు! వారసుల రాకతో ఇంట సిరిసంపదలే.

మెగా అభిమానులకు ఇది నిజంగా పండగ వార్త! రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని సమాచారం. దీంతో మెగా ఇంట సందడి నెలకొంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉపాసన డెలివరీ: కవల పిల్లలేనా?

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఆల్రెడీ 2023 లో ఒక పాప జన్మించింది. ఆ పాపకు క్లీంకార కొణిదెల అని పేరు పెట్టారు. ఇప్పటిదాకా ఆ పాప ఫేస్ చూపించకపోయినా స్టార్ కిడ్ కావడంతో బాగా ఫేమస్ అయింది. అయితే ఉపాసన మళ్ళీ ప్రగ్నెంట్ అని గత సంవత్సరం దీపావళి సమయంలో ఆమె సీమంతం వీడియో ఒకటి షేర్ చేసారు.(Upasana)

ఈసారి ఉపాసనకు కవలపిల్లలు పుట్టబోతున్నట్టు డబల్ హ్యాపినెస్ అంటూ చరణ్ ఉపాసన సీమంతం వీడియో షేర్ చేసి గతంలోనే హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ కవలలు వచ్చే సమయం ఆసన్నమైంది. ఉపాసన రేపు జనవరి 31న కవలపిల్లలకు జన్మనివ్వనుందని మెగా సన్నిహితుల సమాచారం. దీంతో మెగా వారసులు వస్తున్నారు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

రాముడి నక్షత్రంలో మెగా వారసులు!

ఇక కొంతమంది ఫ్యాన్స్ అయితే రేపు నక్షతరం ఏంటి, ముహుర్తాలు, తిథులు ఏంటి అని వైరల్ చేస్తున్నారు. హిందూ పంచాగం ప్రకారం రేపు జనవరి 31 శనివారం ఉదయం 7 గంటల 38 నిముషాల వరకు త్రయోదశి ఉంది. ఆ తర్వాత చతుర్ధశి తిథి మొదలవుతోంది. ఆ రోజు శని త్రయోదశిగా పరిగణిస్తారు. త్రయోదశి శనికి సంబంధించిన పవర్ ఫుల్ తిథి అయితే చతుర్థశి శివుడికి ప్రియమైన తిథి. అలాగే రేపంతా కూడా పునర్వసు నక్షత్రమే. పునర్వసు నక్షత్రం శనివారం రాత్రి ఒంటిగంట 41 నిముషాల వరకు ఉంది. అంటే రోజు మొత్తం పునర్వసు నక్షత్రం ఉంది.

పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుడి నక్షత్రం. రాముడు ఆ నక్షత్రంలోనే పుట్టాడు. మెగా ఫ్యామిలీ ఆరాధ్య దైవం ఆంజనేయస్వామి అని తెలిసిందే. ఆంజనేయుడి ఆరాధ్య దైవం రాముడు. దీంతో మెగా ఫ్యాన్స్ రాముడు పుట్టిన నక్షత్రంలో వారసులు పుడుతున్నారు అని అంటున్నారు. సాధారణంగా పిల్లలు పుట్టాక ఏ నక్షత్రంలో జన్మించారో చూసి దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. అయితే పునర్వసు నక్షత్రానికి సంబంధించి ఏ పాదంలో జన్మించినా మంచిదే, ఎలాంటి దోషం లేదు అని పండితులు చెప్తున్నారు.

మెగా ఫ్యాన్స్ సంబరాలు షురూ!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు ఇంటర్నెట్ మాధ్యమాల నుంచి సేకరించబడింది. వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

ఉపాసన కవలల రాకతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తోంది. రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ శుభవార్తతో సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.