|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థియేటర్లలో పండగ: రేపు విడుదలవుతున్న చిత్రాల పూర్తి జాబితా!

Published: 30-04-2026, 8:57 PM
థియేటర్లలో పండగ: రేపు విడుదలవుతున్న చిత్రాల పూర్తి జాబితా!
  • మే 1న పలు భాషల్లో క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి.
  • కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో ‘జెట్లీ’ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.
  • ‘ఓ తండ్రి కథ’ తండ్రి గొప్పతనాన్ని చూపించే భావోద్వేగ చిత్రం.
  • తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్ ల ‘గాయపడ్డ సింహం’ ఆకట్టుకుంటోంది.

ప్రతి నెల మాదిరిగానే, ఈ మే నెల కూడా సినిమాల సందడితో మొదలవుతోంది. మే 1న థియేటర్లలో పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు, యాక్షన్, డ్రామా చిత్రాలతో ఈ వారం థియేటర్లలో పండగ వాతావరణం నెలకొననుంది.

జెట్లీ: సత్య కామెడీతో థియేటర్లలోకి

Upcoming Movies in Theater : ప్రతి నెల ప్రతి వారం సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఏప్రిల్, మే నెలలో సమ్మర్ స్పెషల్ సినిమాలు బోలెడు థియేటర్లోకి రాబోతున్నాయి.. గత నెలలో సినిమాలతో పోలిస్తే ఈ నెలలో సినిమాలో బోలెడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ఇన్ అయితే సొంతం చేసుకున్నాయి. ఇక ఈ నెల ముగిసింది మే నెల కొత్త సినిమాలను తెచ్చేస్తుంది. మే ఒకటో తారీఖున బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి.. మరి ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం..

మే 1న పలు భాషల్లో క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు యాక్షన్, డ్రామా, మాస్ యాక్షన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. అవేంటంటే…

టాలీవుడ్ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జెట్లీ.. గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మత్తు వదలరా సినిమా డైరెక్టర్ రితేష్ రాణా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. రియా సింఘా హీరోయిన్. సినిమా గ్లింప్స్, ట్రైలర్ చాలా హిలేరియస్‌గా ఉన్నాయి.. ముఖ్యంగా సత్య కామెడీ పీక్స్‌లో ఉంటుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ మే డే సందర్భంగా రేపు థియేటర్లలోకి రాబోతుంది…

ఓ తండ్రి కథ: భావోద్వేగ భరిత చిత్రం

కుటుంబ పెద్దగా ఉన్న తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు ఎలాంటి కష్టాన్ని అనుభవిస్తాడు? పిల్లలు ఎదుగుదలని తన ఎదుగుదలగా భావిస్తాడు.. ఒక జీవికి తండ్రి అవసరం చాలా ఉంటుంది. తండ్రి గొప్పతనాన్ని హృదయాన్ని హత్తుకునేలా చూపించే భావోద్వేగ చిత్రం ‘ఓ తండ్రి కథ’.. మే 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. వైఎస్‌కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల, విజయలక్ష్మీ, తోట సుబ్బారావు, వి. కరుణాకర్ కీలక పాత్రల్లో నటించారు.. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరికెక్కుతుంది..

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం‘ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు.. ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ట్రైలర్, మిగిలిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి.. అంతే కాదు ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా మొదలు పెట్టడంతో సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

గాయపడ్డ సింహం: తరుణ్ భాస్కర్ కొత్త ప్రయత్నం

వీటితో పాటుగా మరో రెండు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.. ఏప్రిల్ 30న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కరా మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ పై ఆసక్తి నెలకొంది.. మరి ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడుతున్న సినిమాలలో ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

ఈ మే నెలలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. జెట్లీ, ఓ తండ్రి కథ, గాయపడ్డ సింహం వంటి విభిన్న చిత్రాలు ఈ వారం విడుదలవుతున్నాయి. ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.