|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉప్పల్ బాలు సంచలన నిజాలు! నెల సంపాదన లీక్! బంధువులు ఎందుకు దూరం? దిమ్మతిరిగే ట్విస్ట్!

Published: 09-04-2026, 11:35 PM
ఉప్పల్ బాలు సంచలన నిజాలు! నెల సంపాదన లీక్! బంధువులు ఎందుకు దూరం? దిమ్మతిరిగే ట్విస్ట్!
  • ఉప్పల్ బాలు ఇప్పుడు హియ్యా మండికి బ్రాండ్ అంబాసిడర్!
  • నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న బాలు.
  • గౌతమి ఆధ్వర్యంలో ప్రమోషన్లు చేస్తూ బిజీగా ఉన్న బాలు.
  • గతంలో పిచ్చి వీడియోలు చేసినందుకు బంధువులు దూరం పెట్టారు!

ఉప్పల్ బాలు గురించి మీకు తెలుసా? ఒకప్పుడు టిక్ టాక్ స్టార్, ఇప్పుడు హియ్యా మండి బ్రాండ్ అంబాసిడర్! అతని జీవితంలో వచ్చిన మార్పులు, సంపాదన వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

ఉప్పల్ బాలు జీవితంలో అనూహ్య మార్పు!

ఉప్పల్ బాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. బాలు వీడియోలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉన్నారు.. విమర్శించేవారు ఉన్నారు. నోటికొచ్చినట్టు తిట్టేవారు కూడా ఉన్నారు. కానీ ఎవరికి నష్టం కలిగించకుండా.. ఎవరిని బాధపెట్టకుండా .. డిఫరెంట్ స్టైల్ లో.. వీడియోలు చేసి.. విమర్శలను కూడా లెక్క చేయకుండా ముందుకు దూసుకెళ్లాడు ఉప్పల్ బాలు.

ఇండస్ట్రీలో తనకంటై ప్రత్యేక స్థానం  సంపాదించుకున్నాడు. బాలు చేసే వీడియోలు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నా.. ఆతరువాత కాలంలో వాటిని వదిలేస్తూ  వచ్చాడు. తన లైఫ్ ను మార్చుకుని.. ఆలోచనలలో మార్పు తెచ్చుకుని.. ప్రస్తుతం ఈవెంట్స్ చేసుకుంటూ.. గౌరవంగా బ్రతుకుతున్నాడు..

ఒకప్పుడు ఉప్పల్ బాలు అంటే.. పెద్ద పెద్ద అరుపులు, కేకలు.. డబుల్ మీనింగ్ డైలాగ్స్, డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్, కనిపించేది. మూడు వందల నుంచి.. 1000 రూపాయల వరకూ.. చిన్న చిన్న ప్రమోషన్లు చేస్తూ.. పెళ్లిళ్లు.. ఫంక్షన్స్ లో సందడి చేస్తూ.. డబ్బులు సంపాదించేవాడు. డబ్బు అవసరం ఉండటంతో.. బాలు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు.

బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?

ఎంత మంది ఏమనుకున్నా.. తన కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు బాలు. కానీ ఇప్పుడు బాలులో కంప్లీట్ గా మార్పు వచ్చింది. తనను నమ్మి ఒకరు దారి చూపించడంతో.. వారు చెప్పినట్టుగా చేస్తూ.. కామ్ గా కూల్ గా ప్రమోషన్లు చేస్తున్నాడు.

సోషల్ మీడియా స్టార్ గా ఉన్న బాలుని హియ్యా మండి టీమ్ దగ్గరకు తీసింది. ఆ కంపెనీకి బాలు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఆ టీమ్ లీడర్ గౌతమి బాలుతో ప్రమోషన్లు చేయించుకుంటూ.. రకరకాల థీమ్స్ తో బాలుని బిజీ చేశారు. అంతే కాదు కంటీన్యూగా ఆ కంపెనికి పనిచేసినందుకు నెలకు లక్ష రూపాయల వరకూ జీతం కూడా ఇస్తున్నారు. బాలు గౌరవంగా బ్రతికేలా దారి చూపించారు.

దాంతో బాలు కూడా గతంలో మాదిరిగా పిచ్చి పిచ్చి వీడియోలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అరుపులు కేకలు లేకుండా కామ్ గా తన పని తాను చేసకుంటూ వెళ్తున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు. ఖాళీటైమ్ లో ఈవెంట్లు కూడా చేసుకుంటున్నాడు. గతంలో లా తాను పిచ్చి వీడియోలు చేస్తే.. నన్ను నమ్మి.. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాడమ్ కు పేరు వస్తుంది అందుకే ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయాను అని బాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు

టిక్ టాక్ స్టార్ ను వెలివేసిన బంధువులు!

చిన్నప్పుడు తనను ప్రేమగా చూసుకున్న బంధువులు చాలామంది.. టిక్ టాక్ వీడియోలు స్టార్ట్ చేసిన తరువాత తనను వెలివేశారని బాలు ఓ సందర్భంలో వెల్లడించాడు. ఇంటికి రావద్దు, పెళ్లిళ్లకు పిలవం, అసలు తనతో సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు కాస్త బాధనిపించినా..తన పని మాత్రం తాను చేసుకుంటూ వెళ్లాడు ఉప్పల్ బాలు.

ఇప్పుడు ఫేమస్ అయిన తరువాత డబ్బు సంపాదిస్తుంటే.. తమ ఇంటికి రావాలంటూ బ్రతిమలాడుతున్నారని బాలు వెల్లడించాడు. కానీ తాను మాత్రం తనను అర్ధం చేసుకున్న వారితో మాత్రమే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. బంధువులకంటే.. బయటవారే తనను ప్రేమగా చూసుకుంటున్నారని బాలు వెల్లడించాడు. బంధువులు పిలిచినా వెళ్లడంలేదంటూ కామెంట్స్ చేశాడు.

బాలు పిచ్చి పిచ్చి వీడియోలు చేసినా.. ఎవరి మనసు నొప్పింలేదు. ఎవరిని ఇమిటేట్ చేయలేదు. అంతే కాదు ఆయన ఎంత ఫేమస్ అయినా.. బెట్టింగ్ యాప్స్ ను మాత్రం ప్రమోట్ చేయలేదు. 30 లక్షలు ఇస్తాం నెలకు.. బెట్టింగ్ యాప్ప్ ప్రమోట్ చేయమని చాలా మంది అడిగారుట. కానీ తాను మాత్రం రిస్క్ తీసుకోదలుచుకోక..వాటిని చేయలదేని బాలు చెప్పారు. అలా చేయకపోవడం వల్లనే ఉప్పల్ బాలు సిన్సియారిటీ నచ్చి.. హియ్యా మండీ టీమ్ అతనికి అవకాశం ఇచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు. మొత్తానికి బాలు చాలా కామ్ గా.. కూల్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. గతంలో కంటే చాలా మారిపోయాడు.

ఉప్పల్ బాలు జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అతను ఇప్పుడు గౌరవంగా జీవిస్తున్నాడు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.