|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొత్త ఇంట్లోకి సతీసమేతంగా ‘బుచ్చిబాబు’ గృహప్రవేశం

Published: 09-11-2025, 1:08 AM
కొత్త ఇంట్లోకి సతీసమేతంగా 'బుచ్చిబాబు' గృహప్రవేశం

ఉప్పెన సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన బుచ్చిబాబు, పిఠాపురంలో నిర్మించుకున్న ఇంట్లో శనివారం సతీసమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

Key Points

1

జాతీయ అవార్డు గెలుచుకున్న 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కొత్త ఇల్లు కట్టుకున్నారు.

2

శనివారం సతీసమేతంగా పిఠాపురంలో తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు.

4

సుకుమార్ శిష్యుడిగా పరిశ్రమకు పరిచయమై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఉప్పెన తర్వాత పెద్ది సినిమాతో బిజీ

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, జాతీయ అవార్డు అందుకున్న బుచ్చిబాబు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. మొదటి సినిమానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి పాన్‌-ఇండియా ప్రాజెక్ట్‌ ‘పెద్ది’ని తెరకెక్కిస్తున్నారు.

సతీసమేతంగా కొత్త ఇంటి గృహప్రవేశం

కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన బుచ్చిబాబు తాజాగా పిఠాపురంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. గృహప్రవేశం కార్యక్రమంలో వల్ల గత రాత్రి జరిగిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు బుచ్చిబాబు రాలేకపోయారు. కానీ, ఆయన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా సాంగ్‌ ఈ కార్యక్రమంలో మరోసారి ప్రేక్షకులకు లైవ్‌లో వినిపించారు.

గురు-శిష్యుల బంధం: సుకుమార్-బుచ్చిబాబు

లైఫ్‌ ఇచ్చిన సుకుమార్‌ బుచ్చిబాబు, సుకుమార్‌లది గురు-శిష్యుల బంధమని తెలిసిందే. సుకుమార్‌ కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా పనిచేశారని తెలిసిందే. అయితే,  అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సుకుమార్‌ చెప్పే పాఠాలంటే బుచ్చిబాబుకు బాగా ఇష్టం ఉండేది. దీంతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే, గురువు దర్శకుడిగా మారడంతో తాను కూడా అదే దారిలో అడుగులు వేశారు. అలా ‘ఆర్య 2’ నుంచి సహాయ దర్శకుడిగా బుచ్చిబాబు పరిశ్రమలోకి  ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సుకుమార్‌ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం,100% లవ్‌ వంటి చిత్రాలకు అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేశారు.

ఉప్పెనతో విజయం సాధించి, ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘పెద్ది’ వంటి భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబుకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన సినీ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.