
📌 Key Points
- ఇరాన్‌లో పాలన మార్పు కోసం యుద్ధం చేయలేదని అమెరికా రక్షణ శాఖ ప్రకటన.
- అణ్వాయుధాల నిర్మూలన కోసమే యుద్ధం చేశామని అమెరికా స్పష్టీకరణ.
- ఖమేనీ మృతితో పశ్చిమాసియా రాజకీయ సమీకరణాల్లో వేగంగా మార్పులు.
- ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాల వెనుక ఇరాన్ హస్తం ఉందని నిఘా వర్గాల అనుమానం.
అమెరికా రక్షణ శాఖ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లో పాలకులను మార్చడానికి తాము యుద్ధం చేయలేదని స్పష్టం చేసింది. అణ్వాయుధాల నిర్మూలన కోసమే పోరాడామని తెలిపింది. ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
యుద్ధంపై అమెరికా రక్షణ శాఖ ప్రకటన
యుద్ధంపై అమెరికా రక్షణశాఖ(US Defense Department) కీలక ప్రకటన చేసింది. ‘మేము ఇంకా యుద్ధం ప్రారంభించలేదు.. అయినా ముగింపు పలికేందుకు సిద్ధంగానే ఉన్నాం. మేము ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ మొండిగానే ప్రవర్తించింది. అణ్వాయుధాల తయారీని కొనసాగిస్తూనే వచ్చింది. కనీసం ఖమేని మా హెచ్చరికలను కూడా లెక్కచేయలేదు. పైగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ చేతిలో చావు తప్పదని అన్నారు. తీరా చూస్తే యుద్ధంలో ఖమేని చనిపోయారు. ఈ యుద్ధం కారణంగా ఇరుపక్షాలకు భారీ నష్టం జరుగుతోంది. మేము ఇరాన్‌లో పాలకులకు మార్చేందుకు యుద్ధం చేయడం లేదు. కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకే యుద్ధం చేశాం. ఇక ఇది సరైంది కాదు అనిపిస్తోంది’ అని అమెరికా రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధితో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఖమేనీ నన్ను చంపేలోపే నేను అతడిని అంతమొందించాను వారు రెండుసార్లు నాపై కుట్ర చేశారు.. కానీ నేను వారికంటే ముందే పని ముగించాను” అని ట్రంప్ గర్వంగా చెప్పుకొచ్చారు. 2024లో ట్రంప్‌పై జరిగిన రెండు హత్యాయత్నాల వెనుక ఇరాన్ హస్తం ఉందని నిఘా వర్గాల అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ అనుమానాలు నిజమే అని అర్థం అవుతోంది.
ఖమేనీ మృతితో మారుతున్న సమీకరణాలు
ట్రంప్‌పై ఇరాన్ కుట్రలు నిజమేనా?
ఖమేనీ మరణం తరువాత పశ్చిమాసియా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాల వెనుక ఇరాన్ హస్తం ఉందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.


