|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ విధ్వంసం! ఫస్ట్ రిపోర్ట్ లీక్, బాక్సాఫీస్ బద్దలే!!

Published: 17-03-2026, 1:35 AM
ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ విధ్వంసం! ఫస్ట్ రిపోర్ట్ లీక్, బాక్సాఫీస్ బద్దలే!!
  • పవన్‌ కళ్యాణ్ విశ్వరూపం: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో మాస్ యాక్షన్, అదిరిపోయే కామెడీ, యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ సీన్స్!
  • శ్రీలీలతో పవన్ కెమిస్ట్రీ అదుర్స్, రాశీఖన్నాతో కలిసి వేసిన స్టెప్పులకు థియేటర్లలో అభిమానుల డాన్సులు గ్యారంటీ!
  • హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, పవన్ ఎంట్రీ సీన్లకు థియేటర్లు దద్దరిల్లుతాయి, ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోతాయి!
  • బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ! అడ్వాన్స్ బుకింగ్స్‌లో రెస్పాన్స్ అదిరింది, పవన్ ఫ్యాన్స్‌కు పండుగే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదవండి!

వింటేజ్ పవన్‌ కళ్యాణ్‌ని చూస్తారా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో రాబోతున్నారు. మరో రెండు రోజుల్లో(మార్చి 19న) ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇక బాక్సాఫీస్‌ ని షేక్‌ చేసేందుకు వస్తోంది. మొన్న ట్రైలర్‌, ఆ తర్వాత ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో మూవీకి మంచి బజ్‌ ఏర్పడింది. అంతకు ముందు బజ్‌ పెద్దగా లేదు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా వస్తుందంటే ఆ హడావుడి, అభిమానుల హంగామా వేరేలా ఉంటుంది, కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం సీన్‌ రివర్స్ లా ఉండింది. ఇంతగా బజ్‌ లేని పవన్‌ సినిమా ఇదే అని ప్రచారం జరిగింది.

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ఇప్పుడు మంచి బజ్‌ ఏర్పడిందని చెప్పొచ్చు. టీమ్‌ గట్టిగా బజ్‌ని క్రియేట్‌ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఏపీలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్‌ అయ్యాయి. దీనికి రెస్పాన్స్ బాగానే ఉంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. టీమ్‌ చెప్పినదాని ప్రకారం, సినిమా చూసిన వారి అభిప్రాయం ప్రకారం మూవీ అదిరిపోయిందంటున్నారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ మూవీ అని, వింటేజ్‌ పవన్‌ కళ్యాణ్‌ని చూస్తారని అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షో చూస్తారని, మాస్‌ లుక్‌లో ఆయన అదరగొట్టాడని అంటున్నారు. యాక్షన్‌, మాస్‌ డైలాగ్‌లే కాదు, కామెడీ కూడా అదిరిపోతుందట. పవన్‌ ఇందులో కామెడీ బాగా చేశాడని, డాన్సుల కోసం కూడా బాగా కష్టపడ్డాడని అంటున్నారు. రొమాంటిక్‌ సీన్లు కూడా బాగుంటాయి. ముఖ్యంగా పవన్‌, శ్రీలీల మధ్య వచ్చే సీన్లు యూత్‌ని ఆకట్టుకుంటాయని, రాశీఖన్నాతో సాంగ్‌లో వేసిన డాన్స్ ఆడియెన్స్ చేత స్టెప్పులు వేయించేలా ఉంటుందట.

శ్రీలీలతో రొమాన్స్ ఎలా ఉండబోతుంది?

సినిమాలో హై ఇచ్చే సీన్లు చాలా ఉన్నాయట. ఎక్కడైతే లో అవుతుందో, వెంటనే హై ఇచ్చే సీన్లు పడ్డాయని, దీంతో మూవీ వేరే స్థాయికి వెళ్తుందని చెబుతున్నారు. పవన్ ఎంట్రీ సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా డిజైన్ చేశారట. పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ లు మాస్ ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉంటాయని,  ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. సినిమాలో ఉన్న రెండు మాస్ సాంగ్స్ థియేటర్లను షేక్ చేస్తాయంటున్నారు. డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ స్టైలే వేరు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషన్స్, వినోదాన్ని మేళవించి కథను ఆసక్తికరంగా మలిచారని టాక్‌. పవన్ కళ్యాణ్ వర్సటైల్ యాక్టింగ్‌ను పూర్తిస్థాయిలో వాడుకుంటూ, ఈ సినిమాను ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని, మొత్తానికి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించే మూవీ అవుతుందంటున్నారు.

దీనిపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా తన రివ్యూ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ పర్‌ఫెర్మెన్స్ బద్దలవుతుందని, ఆయన ఇందులో అన్నీ చేశారని, క్లైమాక్స్ వరకు ఒక లెక్క, క్లైమాక్స్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంటుందన్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ దీనికి సంగీతం అందించారు. థమన్‌ బీజీఎం చేశారు. బీజీఎం దుమ్ములేచేలా ఉంటుందని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారని ఇటీవల హరీష్‌ చెప్పారు.

హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ అదిరిపోయాయా?

మరోవైపు ఈ మూవీపై ఓవర్సీస్‌ క్రిటిక్స్ గా భావించే ఉమైర్‌ సందు  తన రివ్యూ ఇచ్చాడు. ఇది పవన్‌ కళ్యాణ్‌ రైడ్‌ అని, ఇందులో ఆయనే బిగ్‌ బాస్‌ అని చెప్పాడు. ఆయనలా మరెవ్వరూ చేయలేరని, ఆయన షోని దొంగిలించాడని, సినిమా మొత్తం తన భుజాలపై నడపించాడని చెప్పాడు. అలాగే శ్రీలీలా చాలా హాట్‌గా ఉందని, సినిమా మంచి మాస్‌ మసాలా ఫిల్మ్ అని, జనాలతో థియేటర్లు నిండిపోతుందని చెప్పారు. అంతేకాదు ఆయన ఈ మూవీకి ఏకంగా నాలుగు రేటింగ్‌ ఇవ్వడం విశేషం. మరి ఆయన చెప్పినదాంట్లో నిజం ఎంత అనేది చూడాలి.

ఇదిలా ఉంటే ఈ మూవీలో కొన్ని మైనస్‌లు వినిపిస్తున్నాయి. మాస్‌ కమర్షియల్‌ మూవీ అనేసరికి కొంత రొటీన్‌ ఫీలింగ్‌ అనిపిస్తుందట. రెగ్యూలర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో మూవీ ఉంటుందట. పాటలు సరిగా లేవు. ఒక్కటి కూడా  మళ్లీ మళ్లీ వినేలా లేవు, ఏమాత్రం ఆసక్తిని పెంచేలా లేవు. అదే సమయంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ఆడియెన్స్ లో నమ్మకం తగ్గింది. ఆయన చివరగా తీసిన `గద్దల కొండ గణేష్‌` యావరేజ్‌గా ఆడింది. `మిస్టర్‌ బచ్చన్‌` డిజాస్టర్‌ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ ప్రభావం `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`పై పడింది. అది కూడా ఈ మూవీకి బజ్‌ లేకపోవడానికి కారణమని చెప్పొచ్చు. మరి హరీష్‌ రెగ్యూలర్‌ మూసలోకే వెళ్తాడా? ఈ సెంటిమెంట్‌ని బ్రేక్‌ చేస్తాడా అనేది చూడాలి. ఆయన మాత్రం ఇది మరో `గబ్బర్‌ సింగ్‌` అవుతుందని చెప్పడం విశేషం. యూ ఏ సర్టిఫికేట్‌ పొందిన ఈ మూవీ రెండున్నరగంటల నిడివితో ఉంటుందట.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.