|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ మాస్ జాతర షురూ! డబ్బింగ్ మొదలు, ఇక థియేటర్లే టార్గెట్!

Published: 27-01-2026, 6:35 AM
ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ మాస్ జాతర షురూ! డబ్బింగ్ మొదలు, ఇక థియేటర్లే టార్గెట్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి.
  • పవన్ కళ్యాణ్ స్వయంగా డబ్బింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
  • గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారు.

వేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ పనులు

Ustaad Bhagat Singh ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినప్పటికీ.. సినిమాల విషయంలో కూడా ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఓజీ సినిమాతో మంచి విజయం అందుకున్నా. ఈ క్రమంలో తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా.. ఎప్పుడెప్పుడా..ఎదురుచూస్తున్న.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు వేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్తతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తన ఎనర్జిటిక్ రైటింగ్, మాస్‌కు నచ్చే డైలాగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్‌ను అభిమానులు ప్రేమగా కల్ట్ కెప్టెన్ అని పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. ఆ పేరుకు తగ్గట్టుగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా ఒక ప్రత్యేకమైన మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన గట్టిగా శ్రమిస్తున్నారంట. ఇందులో భాగంగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి దృష్టి పెట్టి..ఒక్కో సన్నివేశం మరింత బలంగా కనిపించేలా పనులు జరుపుతున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా ఆయన డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొననుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదే విషయం ఈరోజు ఒక వీడియో ద్వారా దర్శకుడు తెలిపారు. ఆ వీడియో ద్వారా త్వరలోనే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కోసం రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వాయిస్‌తో డైలాగ్స్‌కు వచ్చే బలం సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి ఇలా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో త్వరలోనే ఫుల్ మాస్ ట్రీట్.. ఇవ్వడానికి సిద్ధమైపోయారు హరీష్ శంకర్.

గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. ఆ సినిమాతో ప్రేక్షకులపై ఈ కాంబినేషన్ వేసిన ముద్ర ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేస్తారా అనే ఆసక్తి అందరిలో ఉంది.

డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్

#UstaadBhagatSingh dubbing begins on an auspicious note ✨

Get ready for the POWERFUL DIALOGUES penned by our CULT CAPTAIN 🔥🔥

POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro @MythriOfficial @SonyMusicSouth … pic.twitter.com/gtPbA7KY3r

— Mythri Movie Makers (@MythriOfficial) January 27, 2026

మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని.. రవి శంకర్ యలమంచిలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. భారీ సెట్లు..క్వాలిటీ టెక్నికల్ వర్క్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ పాట పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మిగతా పాటలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ సినిమా.. శ్రీలీల, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బలమైన సాంకేతిక బృందం పనిచేస్తుండటంతో సినిమా అవుట్‌పుట్‌పై నమ్మకం పెరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్లను నిర్మాతలు వెల్లడించనున్నారు అని వినికిడి.

మొత్తానికి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.