
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 15న యూసుఫ్ గూడలో!
- హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మాస్ అవతార్.. గబ్బర్ సింగ్ తర్వాత మరో హిట్?
- ఉగాది కానుకగా మార్చి 19న విడుదల.. భారీ అంచనాలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’!
- ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఏం మాట్లాడతారో?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాన్స్ కి పండగే.
పవన్ కళ్యాణ్ మాస్ జాతర ఎక్కడ?
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే OG సినిమాతో భారీ హిట్ కొట్టి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఉగాదికి ‘ఉస్తాద్’ ట్రీట్ పక్కా!
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది కానుకగా రిలీజ్ కానుంది. అయితే పవన్ ఏపీలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండటంతో ప్రమోషన్స్ కి రాడని తెలిసిందే. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం వస్తారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటుంది, పవన్ ఏం మాట్లాడతాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
పవన్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చ్ 15న ఆదివారం నాడు సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరుగబోతుందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా ఫ్యాన్స్ రానున్నారు. OG సక్సెస్ ఈవెంట్ తర్వాత మళ్ళీ సినిమా ఈవెంట్లో కనిపించబోతున్న పవన్ ఫ్యాన్స్ కోసం, సినిమా గురించి ఏం మాట్లాడతారో చూడాలి.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


