|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ విశ్వరూపం! మార్చి 19న థియేటర్లలో విధ్వంసం!

Published: 14-03-2026, 11:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ విశ్వరూపం! మార్చి 19న థియేటర్లలో విధ్వంసం!
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం రూపొందింది.
  • ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, ఇది అభిమానులకు ఫుల్ మీల్స్ అని తెలుస్తోంది.
  • ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి.
  • మార్చి 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్‌గా విడుదల కానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా మార్చి 19న విడుదల కానుంది.

ట్రైలర్ ఎలా ఉంది?

Ustaad Bhagat Singh Trailer: ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంప.. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యూబైఏ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం మార్చి 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ (Ustaad Bhagat Singh Trailer) ఎలా ఉందంటే..

డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్!

2 నిమిషాల 14 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌ని హరీష్ రెడీ చేశాడనేది తెలియజేస్తోంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరి కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండాలో అలా ‘ఉస్తాద్’ ఉండబోతుందనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. డైలాగ్స్, పంచ్‌లు, గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నింటినీ కల్ట్ కెప్టెన్ ఇందులో పొందుపరిచారు. ‘వాడు నీకు భయపడలేదా.. అసలు ఎవడికి భయపడలేదా?’ అనే విలన్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్‌తో చూపు తిప్పుకోనివ్వకుండా.. లీనమయ్యేలా ఈ ట్రైలర్ ఉంది. ‘ఎవ్వడికీ భయపడట్లేదు’ అని పవన్ కళ్యాణ్ పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందో రివీల్ చేశారు. ‘వైలెన్స్ అంటే మీనింగ్ తెలియదు.. మీ అందరికీ ఓ ఫ్యాషన్ అయిపోయింది’, ‘చూపిస్తా.. అర్థం, భావం, అవసరం.. అన్నీ చూపిస్తా’, ‘ప్రాస కోసం ప్రాణం మీదకు తెచ్చుకోకండి.. చూస్తున్నారుగా’, ‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం.. డ్యాన్స్’.. ఇలాంటి డైలాగ్స్ అన్నీ బాగా పేలాయి.

మార్చి 19న గ్రాండ్ రిలీజ్

హీరోయిన్లు శ్రీలీల, రాశీ ఖన్నాలకు కూడా ఇందులో చోటు కల్పించారు. పార్థిబన్ విలన్ పాత్రని పెద్దగా పరిచయం చేయలేదు, అలాగే కథ కూడా రివీల్ కానివ్వలేదు. మొత్తం పవన్ కళ్యాణే ట్రైలర్ అంతా అనేలా ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. ‘సంతోషంగా ఉండటం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం.. మన జీవితానికి ఎవడెవడో లైక్‌లు కొట్టడం కాదు’ అంటూ ఫిలాసపీ కూడా హరీష్ ఇందులో ఇరికించేశారు. ‘భగత్ సింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ గన్ పట్టుకుని మరోసారి ‘ఓజీ’ని చూపించేశారు. ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’, ‘ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? అంటూ పవర్ స్టార్ హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తోందీ ట్రైలర్. ‘చూపిస్తా’, ‘చూస్తావా’ అని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తుంటే.. అది విలన్‌కా? వైసీపీకా? అనేలా ఉందంటే.. హరీష్ ఎంత చెప్పినా.. ఏదో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉందనిపిస్తోంది. మొత్తంగా అయితే.. పవన్ కళ్యాణ్ కనిపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. పవన్, హరీష్ కాంబో అంటే ఏమేం ఎక్స్‌పెక్ట్ చేస్తారో.. అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఇక మార్చి 19న థియేటర్ల దగ్గర సందడికి ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ అంచనాలను పెంచేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఒక పండుగలా ఉండనుంది. మార్చి 19 కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.