|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ వేదికగా రాజకీయ దుమారం! పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జగన్ ఫ్యాన్స్!!

Published: 15-03-2026, 11:35 AM
ఉస్తాద్ భగత్ సింగ్ వేదికగా రాజకీయ దుమారం! పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జగన్ ఫ్యాన్స్!!
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో జగన్ వ్యతిరేక నినాదాలు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు.
  • పవన్ కళ్యాణ్ మా దేవుడు అంటూ అభిమానుల నినాదాలు హోరెత్తాయి.
  • ఈవెంట్ రాజకీయ వేదికగా మారడంపై జగన్ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా ఇది.

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈవెంట్‌లో అభిమానులు జగన్ గురించి నినాదాలు చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలవనుంది.

జగన్ పై పవన్ ఫ్యాన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు

Ustad Bhagat Singh Event: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. ఫ్యాన్స్ ను ఈవెంట్ కు కనెక్స్ట్ చేయడంలో భాగంగా వ్యాఖ్యాతలు ఫ్యాన్స్ తో మాట్లాడించగా.. ఫ్యాన్స్ మాట్లాడుతూ ‘‘అరటి పండు తొక్క.. జగన్ గాడు బొక్క’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్క సారిగా అక్కడ ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. అయినా కానీ ఆగకుండా ఫ్యాన్స్ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఒక్క సారిగా సభా ప్రాంగణం అంతా జగన్ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. అదే సందర్భంలో ‘పవన్ కళ్యాణ్ మా దేవుడు’ అంటూ చేసిన నినాదలు ఇప్పుడు హైలెట్ గా మారుతున్నాయి. దీనిని చూసిన జగన్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. సినిమా ఈవెంట్ ను కాస్తా రాయకీయ ఈవెంట్ గా మార్చడం సరికాదంటూ వారు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడితో అయిపోయినా ఈవెంట్ తర్వాత ఎం జరుగుతుందో చూడాలి మరి.

Read also- Ustaad Bhagath Singh vs Dhurandhar 2: ఉస్తాద్ భగత్ సింగ్ చేసిన తప్పు.. ధురంధర్ సినిమాకు ప్లస్ కానుందా..!

రాజకీయ వేదికగా ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాలలో ఒకటి. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ పునరావృతం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదే సమయంలో సంగీత దర్శకుడు థమన్ బీజీఎం అందిస్తున్నారు. ఇలాంటి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also- Yo Yo Honey Singh Concert: యో యో హనీ సింగ్ ఢిల్లీ కన్సర్ట్‌లో రభస.. అభిమానుల మధ్య చెలరేగిన ఘర్షణ..

పవన్, హరీష్ శంకర్ కాంబోపై అంచనాలు

ఇటీవల విడుదలైన  ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో చెప్పిన డైలాగులు సోషల్ మీడియాను ఊపేశాయి. ముఖ్యంగా “గాజు గ్లాసు” నేపథ్యంతో కూడిన సీన్లు పోలీస్ ఆఫీసర్‌గా ఆయన చూపించిన స్వైగ్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉండటంతో, ఆయన షెడ్యూల్‌కు అనుగుణంగా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ సినిమా మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ రాజకీయ రంగు పులుముకోవడం హాట్ టాపిక్ అయింది. ఈ పరిణామాలు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.