|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ustad Bhagat Singh : అప్పుడు అంతాక్షరి.. ఇప్పుడేంటో తెలుసా?

Published: 02-03-2026, 7:05 AM
Ustad Bhagat Singh : అప్పుడు అంతాక్షరి.. ఇప్పుడేంటో తెలుసా?
  • పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల!
  • ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి సీన్ బ్లాక్ బస్టర్ హిట్, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో అంత్యాక్షరి సీన్ లేకున్నా.. పవర్ఫుల్ బ్లాక్ ఉందని హరీష్ శంకర్ వెల్లడి.
  • ఈ సినిమా గబ్బర్ సింగ్ ఫార్ములాను ఫాలో అవ్వదు, సహజంగా ఉంటేనే హిట్టు అంటున్న డైరెక్టర్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా?

గబ్బర్ సింగ్ సక్సెస్ సీక్రెట్ ఏమిటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది. ఈ సినిమా కంటే ముందు పవన్ అనేక అపజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనం సృష్టించి పవన్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో చేరిపోయింది. గబ్బర్ సింగ్ సెకండ్ హాఫ్ లో అంత్యాక్షరి సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ అది ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ లో అంత్యాక్షరి ఉందా?

ఆ సీన్లో ఉన్న కమెడియన్స్ అలాగే పవన్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ ఒక్క సీన్ వల్ల అనేకమంది సినిమాను రిపీటెడ్ గా చూశారు. ప్రస్తుతం పవన్, హరీష్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం రూపొందుతుంది. దీనిని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో హరీష్ శంకర్ తాజాగా చాలామంది సినిమా జర్నలిస్టులతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు మీరు గతంలో పవన్ గారితో చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి సన్నివేశం బాగా పేలింది, దానివల్ల సినిమాకు వచ్చే ఆడియన్స్ సంఖ్య కూడా ఎక్కువయ్యింది, మరి ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశం ఏదైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది.

హరీష్ శంకర్ ఏం చెప్పారో తెలుసా?

దానికి ఆయన సమాధానం చెబుతూ… నేను ఎప్పుడూ కూడా ఆ సినిమాలో హిట్ అయిన ఫార్ములాను ఇందులో వాడాలి అనుకోను. ఏదైనా సహజంగా రావాలి, అప్పుడే ప్రేక్షకులకు అది నచ్చుతుంది, సినిమాకు ప్లస్ అవుతుంది. ఇందులో అంత్యాక్షరి లాంటి సన్నివేశం లేదు, కానీ ఒక పవర్ఫుల్ బ్లాక్ మాత్రం ఉంది. అది జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది, జనాలు మళ్లీ మళ్లీ సినిమాకు వచ్చే విధంగా చేస్తుంది అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

హరీష్ శంకర్ చెప్పిన ఈ విషయాలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల కానుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.