|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వడ్డే నవీన్ రీ-ఎంట్రీ మాస్ అప్డేట్! చిరంజీవి సినిమా చూసి షాక్.. అలాంటిదే కావాలంటున్న హీరో!

Published: 17-06-2026, 4:30 AM
వడ్డే నవీన్ రీ-ఎంట్రీ మాస్ అప్డేట్! చిరంజీవి సినిమా చూసి షాక్.. అలాంటిదే కావాలంటున్న హీరో!
  • వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ జూన్ 19న విడుదల. 12 ఏళ్ల తర్వాత గ్రాండ్ రీ-ఎంట్రీ.
  • చిరంజీవి ‘శంకర వరప్రసాద్’ సినిమా తనకు చాలా నచ్చిందని, అలాంటి కథలు చేయాలని నవీన్ ఆకాంక్ష.
  • ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను మెచ్చుకున్న హీరో.
  • రీ-ఎంట్రీలో హీరోగానే సినిమాలు చేస్తానని, మల్టీస్టారర్‌కు కూడా సిద్ధమని నవీన్ వెల్లడి.

వడ్డే నవీన్ రీ-ఎంట్రీపై టాలీవుడ్‌లో ఉత్కంఠ నెలకొంది. 12 ఏళ్ల విరామం తర్వాత ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’తో వస్తున్న నవీన్, చిరంజీవి సినిమాపై చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుందాం!

రీ-ఎంట్రీ మూవీ రిలీజ్ డేట్ ఖరారు!

Vadde Naveen : ఒకప్పుడు ఫ్యామిలీ, లవ్ సినిమాలతో మెప్పించిన హీరో వడ్డే నవీన్ సడెన్ గా సినిమాలు ఆపేసారు. ఆల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవల తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడారు.

చిరంజీవి సినిమాపై వడ్డే నవీన్ కామెంట్స్ వైరల్!

వడ్డే నవీన్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా నాకు బాగా నచ్చింది. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని ఉంది. ఆయన స్థాయి నుంచి తగ్గి ఫ్యామిలీ, కామెడీతో ఆ సినిమా చేసారు. రీ ఎంట్రీ తర్వాత అలాంటి కథలు వస్తే చేస్తాను. హీరోగానే సినిమాలు చేస్తాను ప్రస్తుతానికి. మల్టీస్టారర్ అయితే చేస్తాను. అలాగే రంగస్థలం, పుష్ప సినిమాలు నచ్చాయి. ఇటీవల లిటిల్ హార్ట్స్ సినిమా చాలా బాగుంది. ఆ సినిమా బాగా నచ్చింది. కోర్ట్ సినిమా కూడా బాగుంది. నాని సినిమాలు బాగుంటాయి అని అన్నారు.

నవీన్ నెక్స్ట్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి?

వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా ఫ్యామిలీ, యాక్షన్, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కింది. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలాంటి కథలతో చేస్తారో చూడాలి.

వడ్డే నవీన్ రీ-ఎంట్రీ ఖచ్చితంగా టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’తో పాటు ఆయన భవిష్యత్ ప్రాజెక్టుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.