|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వడ్డెర్లకు మైనింగ్ లీజుల్లో వాటా: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! మంత్రి సవిత హర్షం.

Published: 27-03-2026, 5:35 AM
వడ్డెర్లకు మైనింగ్ లీజుల్లో వాటా: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! మంత్రి సవిత హర్షం.
  • వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటన.
  • సీనరేజీలో 50% మినహాయింపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సవిత.
  • ఆదరణ 3.0 పథకంలో వడ్డెర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడి.

వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ కానుంది.

వడ్డెర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్లు: మంత్రి సవిత ప్రకటన

వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా మేలు చేయడమే సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి సవిత స్పష్టంచేశారు. దీనిలో భాగంగానే వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయింపుల్లో 15 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చడంపై హర్షం వ్యక్తంచేశారు మంత్రి సవిత. మాటల నిలబెట్టుకున్నందకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

సీనరేజీలో 50% మినహాయింపు: ప్రభుత్వ నిర్ణయం

ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారని, ఆ సమయంలో వడ్డెర సామాజిక వర్గీయులు ఆయన్ని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారన్నారు. రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకోవడం తమ జీవనోపాధిని, ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే తాము గౌరవప్రదంగా జీవనం సాగిస్తామని మంత్రి లోకేశ్ కు అప్పట్లో వినతిపత్రం అందజేశారు.

వడ్డెర సామాజిక వర్గీయులు వినతికి సానుకూలంగా స్పందించిన లోకేశ్, తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని అప్పట్లో భరోసా ఇచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో భేటీ అయిన మంత్రిమండలి సమావేశంలో మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం మేర రిజర్వేషన్లు కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు.

ఆదరణ 3.0 పథకంలో వడ్డెర్లకు ప్రాధాన్యత

సీనరేజీలో కూడా 50 శాతం ఫీజు మినహాయించాలని ఆ బిల్లులో ఉందని మంత్రి సవిత తెలిపారు. మైనింగ్ లీజుల్లో కేటాయింపులు, సినరేజీ మినహాయింపులపై కూటమి ప్రభుత్వం త్వరలోనే జీవో జారీచేయనుందని వెల్లడించారు. త్వరలో ప్రారంభం కాబోయే ఆదరణ 3.0 పథకంలో వడ్డెర్లకు ప్రాధాన్యమివ్వనున్నామన్నారు. మైనింగ్‌లో వినియోగించేలా వడ్డెర్లకు ఆధునిక మిషన్లు అందజేయాలని నిర్ణయించామన్నారు. వెనకబడిన వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా మైనింగ్ లీజుల కేటాయింపుల్లో వడ్డెర సొసైటీలకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.