
📌 Key Points
- ప్రేమ ప్లాన్‌తో వల్లికి దిమ్మతిరిగే షాక్! కాకరకాయ జ్యూస్‌తో నర్మద, అత్త రివెంజ్ షాకింగ్.
- సాగర్‌ను రోడ్డు మీద అవమానించిన రామరాజు, ప్రసాద్. తండ్రి మాటలతో కుమిలిపోయిన సాగర్ ఎమోషనల్.
- “ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా” అంటూ వేదవతికి సాగర్ షాక్. ఉత్కంఠగా మారిన సీరియల్ హై డ్రామా.
- ధీరజ్-ప్రేమల మధ్య కొత్త డ్రామా. వల్లికి ఎదురుదెబ్బ. సీరియల్ లో రాబోయే ట్విస్టులు రచ్చ రచ్చ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ అప్డేట్! ఎపిసోడ్ మొత్తం హై డ్రామా, ఊహించని మలుపులతో నిండిపోయింది. వల్లికి ప్రేమ ఇచ్చిన దిమ్మతిరిగే షాక్ నుంచి సాగర్ సంచలన నిర్ణయం వరకు, ఈ ఎపిసోడ్ మీ ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చుతుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి!
వల్లికి కాకరకాయ జ్యూస్ షాక్!
Illu Illalu Pillalu May 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 4 ఎపిసోడ్ లో ప్రేమ, నర్మదను శ్రీవల్లి ఒక ఆటాడుకుంటుంది. శ్రీవల్లి తిక్క కుదిర్చేందుకు కాకరకాయ జ్యూస్ బలవంతంగా తాగిస్తారు. మరోవైపు రోడ్డు మీద పని చేస్తున్న సాగర్ తో రామరాజు వెటకారంగా మాట్లాడతాడు. సాగర్ ను ప్రసాద్ రెచ్చగొడతాడు.
Illu Illalu Pillalu May 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 4 ఎపిసోడ్ లో.. ఫ్రెండ్ ను డబ్బు అడిగినట్లు ధీరజ్ దగ్గర ప్రేమ నాటకం ఆడుతుంది. ధీరజ్, ప్రేమ కలిసి ఇంటికి వస్తారు. పొద్దున్నే ప్రేమ పావురాలు ఎక్కడికి వెళ్లాయని నర్మద అడుగుతుంది. ఏంటి మీ అక్కకు కూడా చెప్పలేదా? అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు.
రామరాజు వెటకారం.. సాగర్ సహనం కోల్పోయాడు!
జ్యూస్ చేదుగా ఉంది. కాకరకాయ జ్యూస్ ఇస్తారా? మామయ్యకు చెప్తానని వల్లి అంటుంది. కాకరకాయ జ్యూస్ మీకు, కడుపులో బిడ్డకు మంచిదని ధీరజ్ చెప్తాడు. అప్పుడే అత్తయ్యను నర్మద పిలుస్తుంది. బజ్జీలు, కాఫీ అంటూ కడుపులో అడ్డమైన చెత్త వేసింది. కానీ ఆరోగ్యకరమైన కాకరకాయ జ్యూస్ మాత్రం తాగడం లేదని చెప్తుంది. అత్త, కోడళ్లు కలిసి ఆ జ్యూస్ బలవంతంగా తాగిస్తారు.
అప్పుడే బండి మీద రామరాజు , తిరుపతి వస్తారు. రైస్ మిల్ కు వెళ్తే మూటలు మోసే కూలీలాగా చూస్తారు. అందుకే ఎంచక్కా ఏసీ రూమ్ లో జాబ్ చేస్తానని ఎవరో మామయ్య చేయి పట్టుకుని వెళ్లాడు. తిరుపతి.. ఇక్కడ ఏసీ ఉందా? చెయిర్ ఉందా? మరి ఇలా ఎర్రటి ఎండలో పని చేస్తుంటే ఏమంటార్రా అని సాగర్ కు రామరాజు చురకలు అంటిస్తాడు.
బ్యాగ్ సర్దేసుకుని సాగర్ షాకింగ్ నిర్ణయం!
నీ మాటతీరు సరికాదు రామరాజు. కొడుకు జాబ్ చేస్తుంటే ఏ తండ్రి అయినా గర్వంతో పొంగిపోతాడు. కానీ మీరు మాత్రం కన్న కొడుకును రోడ్డు మీద అవమానిస్తున్నారని ప్రసాద్ రావు అంటాడు. నీతో కలిసి దొంగతనంగా జాబ్ కొనుక్కున్నాడు. దానికంటే అవమానం ఏమీ ఉండదని రామరాజు వెళ్లిపోతాడు.
సాగర్ బ్యాగ్ తో బయటకు వస్తాడు. ఆ బ్యాగ్ ఏంటీ? అని వేదవతి అడుగుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని సాగర్ షాక్ ఇస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తానికి, ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ ఈ ఎపిసోడ్‌తో ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది. డ్రామా, ఎమోషన్స్‌తో నిండిన ఈ ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని ఉత్కంఠభరితమైన అప్డేట్‌ల కోసం వేచి ఉండండి!


